భారత్ ఐటీ నెత్తిన ట్రంప్ పిడుగు! హెచ్‌-1బీ, ఎల్‌1 వీసా పొడిగింపునకు కఠిన నిబంధలు!

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత ఐటీ ఉద్యోగులకు షాకిచ్చారు. తరచూ వివాదాస్పద నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ట్రంప్‌ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. హెచ్‌-1బీ, ఎల్‌1 నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల పొడిగింపు ప్రక్రియను కఠినతరం చేశారు.

యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) తెలిపిన వివరాల ప్రకారం..ఇకపై హెచ్‌-1బీ, ఎల్‌1 తరహా నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసాల్ని పొడిగించుకోవాలని భావించేవారు అందుకు తగిన ఆధారాలు చూపించాలి. తమ అవసరం అమెరికాకు ఉందని నిరూపించాలి. ఇందుకు సంబంధించి 13 ఏండ్ల నుంచి అమలవుతున్న విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

Shock to Indian IT Industry, Trump Administration makes H1B, L1B Visa Extension more Difficult

ఇకపై అన్ని బాధ్యతలు దరఖాస్తుదారుపైనే ఉంటాయి. 2004, ఏప్రిల్‌ 23నుంచి అమలవుతున్న విధానం తాజా ఉత్తర్వులతో మారిపోయింది. పాత విధానం ప్రకారం గతంలో ఎవరైనా వర్క్‌వీసాకు అర్హత సాధించివుంటే వారికి వీసా పొడిగింపు సౌలభ్యం ఉండేది. వీసా పొడిగింపులో ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కాదు.

కొత్త విధానం ప్రకారం వీసా పొడిగించుకోవాలనుకునే వారు అందుకు తాము అర్హులని నిరూపించుకోవాలి. అమెరికాకు తమ అవసరం ఉందని రుజువు చేయాలి. అయితే ఇప్పటి వరకు అమెరికాలో నివసిస్తున్న విదేశీయులకే ఈ నిబంధనలు వర్తిస్తాయని అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు విలియం స్టాక్‌ తెలిపారు.

ఇకపై నిరూపణ భారమంతా దరఖాస్తుదారులపైనే ఉంటుంది. అర్హులైన ఇమ్మిగ్రెంట్స్‌కు మాత్రమే అమెరికాలో ఉద్యోగాలు కల్పించాలని ట్రంప్‌ భావిస్తున్నారని యూఎస్‌సీఐఎస్‌ పేర్కొన్నది. అందుకే, హెచ్‌-1బీ, ఎల్‌1 వీసాల పొడిగింపులో సవరణలు చేశారని తెలిపింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a new directive, the Trump administration has made it more difficult for the renewal of non-immigrant visas such as H1B and L1, popular among Indian IT professionals, saying that the burden of proof lies on the applicant even when an extension is sought. Rescinding its more than 13-year-old policy, the US Citizenship and Immigration Services (USCIS) said that the burden of proof in establishing eligibility is, at all times, on the petitioner. USCIS said the previous memorandum of 23 April, 2004 appeared to place this burden on this federal agency. “This memorandum makes it clear that the burden of proof remains on the petitioner, even where an extension of non- immigrant status is sought,” USCIS said in its latest memorandum issued on 23 October.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి