తెహెల్కా లైంగిక దాడి కేసు: షోమా చౌధురి రాజీనామా
న్యూఢిల్లీ: తెహెల్కా లైంగిక దాడి కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి రాజీనామా చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దూకుడుకు పేరు మోసిన జర్నిలిజానికి పేరు పడిన తెహెల్కా గతవారం తీవ్రమైన వివాదంలో చిక్కుకుంది. ఈ వివాదం షోమా చౌధరిని కూడా చుట్టుకుంది.
వివాదం వెలుగులోకి రాగానే షోమా చౌధరి మహిళా జర్నలిస్టుకు మద్దతుగా తేజ్‌పాల్‌పై లైంగిక దాడికి సంబంధించి ఫిర్యాదు చేశారు. అయితే, లైంగిక దాడికి గురైనట్లు భావిస్తున్న మహిళా జర్నలిస్టు తెహెల్కాకు రాజీనామా చేస్తూ షోమా చౌధరిపై కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. షోమా చౌధరి తనను బెదిరించే ధోరణిలో వ్యవహరిస్తున్నారని, తనపై అభాండాలు వేస్తున్నారని మహిళా జర్నలిస్టు షోమా చౌధరిపై ఆరోపణలు చేశారు.

ఇదిలావుంటే, లైంగిక దాడి కేసులో మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో తమ ముందు హాజరు కావాలని గోవా పోలీసులు నిందితుడైన తెహెల్కా వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్ తేజ్‌పాల్‌కు సమన్లు జారీ చేశారు. గురువారం 3 గంటలకు తమ ముందు హాజరు కావాలని వారు సమన్లు జారీ చేశారు.
తేజ్‌పాల్‌కు ఆ మేరకు మెయిల్ చేశామని, ఫోన్ చేసి కూడా చెప్పామన డిఐడి ఓపి మిశ్రా మీడియా ప్రతినిధులకు చెప్పారు. తేజ్‌పాల్‌ను పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications