Sister: ప్రాణానికి ప్రాణం, చెల్లి పెళ్లి చేశారని అక్క ఆత్మహత్య, దూరం అయ్యిందని, శుభకార్యం చేస్తే !

బెంగళూరు: తన చెల్లెలికి దగ్గరగాఉండే యువకుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని ఆమె అక్క తల్లిదండ్రులకు చెప్పింది. పుట్టింటికి దగ్గరగా ఉండే యువకుడితో వివాహం జరిపించాలని యువతి తల్లిదండ్రులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే సరైన వరకుడు చిక్కకపోవడంతో వేరే జిల్లాకు చెందిన యువకుడితో పెళ్లి ఫిక్ప్ చేశారు. తన సోదరికి వేరే జిల్లాకు చెందిన యువకుడితో పెళ్లి చేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని అక్క బెదిరించింది. అక్క అభ్యంతరం చెబుతున్న సమయంలోనే నాలుగు రోజుల క్రితం చెల్లెలి వివాహం జరిపించారు. తన చెల్లెలు తనకు దూరం అయ్యిందని ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 చెల్లెలు అంటే ప్రాణం

చెల్లెలు అంటే ప్రాణం

కర్ణాటకలోని మైసూరు నగరంలోని శ్రీరాంపురలో లక్ష్మి (34), బిందు అనే అక్కాచెల్లి నివాసం ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి బిందు అంటే ఆమె అక్కకు ప్రాణం. తన చెల్లెలు బిందుతో తాను జీవితాంతం కలసి ఉండాలని లక్ష్మి అనుకుంది. చిన్నప్పటి నుంచి ప్రతి విషయం చెల్లికి తెలీకుండా అక్క ఇంత వరకు ఏమీ చెయ్యలేదని సమాచారం.

 ఒకేఊరిలో ఉండాలని ఆశ

ఒకేఊరిలో ఉండాలని ఆశ

అక్క లక్ష్మికి ఇప్పటికే మైసూరుకు చెందిన యువకుడితో వివాహం జరిగిపోయింది. రెండు సంవత్సరాల నుంచి లక్ష్మి సోదరి బిందుకు పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూస్తున్నారు. తన చెల్లెలు బిందుకు మైసూరులోనే ఉండే యువకుడికి ఇచ్చి వివాహం చెయ్యాలని ఆమె అక్క లక్ష్మి తల్లిదండ్రులకు చెప్పింది. పుట్టింటికి దగ్గరగా ఉండే యువకుడితో బిందు వివాహం జరిపించాలని యువతి తల్లిదండ్రులు అనేక ప్రయత్నాలు చేశారు.

 చిక్కమగళూరు యువకుడు

చిక్కమగళూరు యువకుడు

మైసూరు నగరంతో పాటు ఆ జిల్లాలోని యువకుడికి బిందుతో వివాహం జరిపించాలని అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఎక్కడా సరైన సంబందం సెట్ కాలేదు. చివరికి చిక్కమగళూరు జిల్లాలోని కోప్ప తాలుకాలోని గ్రామంలో నివాసం ఉంటున్న మహేష్ అనే యువకుడితో బిందు వివాహం జరిపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

 పెళ్లి చెయ్యకూడదని బెదిరించిన అక్క

పెళ్లి చెయ్యకూడదని బెదిరించిన అక్క

చిక్కమగళూరు యువకుడికి బిందుతో వివాహం జరిపిస్తే నేను ఆత్మహత్య చేసుకుంటానని లక్ష్మి ఆమె కుటుంబ సభ్యులను బెదిరించింది. అయితే లక్ష్మి బెదిరింపులను ఆమె కుటుంబ సభ్యులు పెద్దగా పట్టించుకోలేదు. బిందు కూడా చిక్కమగళూరు యువకుడిని వివాహం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్క లక్ష్మి అభ్యంతరం చెబుతున్న సమయంలోనే నాలుగు రోజుల క్రితం 16వ తేదీ చెల్లెలు బిందు వివాహం గ్రాండ్ గా జరిపించారు. బిందు వివాహానికి ఆమె అక్క లక్ష్మి హాజరుకాలేదు.

Recommended Video

    Lord Jagannath Story | History Of Puri Temple | Indradyumna | Lord Vishnu
     చెల్లికి పెళ్లి.... అక్క ఆత్మహత్య

    చెల్లికి పెళ్లి.... అక్క ఆత్మహత్య

    తన సోదరి బిందు తనకు దూరం అయ్యిందని నాలుగు రోజుల నుంచి లక్ష్మి కుమిలిపోయింది. లక్ష్మికి సర్దిచెప్పడానికి ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే చెల్లెలు బిందు దూరం అయిన విషయం జీర్ణించుకోలేని లక్ష్మి ఇంటిలో కుటుంబ సభ్యులు నిద్రపోయిన తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివాహం జరిగి నాలుగు రోజులు కూడా కాకముందే పెళ్లి కూతురి అక్క ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఇంటిలో విషాదచాయలు నెలకొన్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+