సెక్స్ స్యాండల్ ఎఫెక్ట్, ఎంపీ తల్లికి నోటీసులు ఇచ్చిన సిట్, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో ?
హాసన్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో స్కామ్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసులో బాధితులు చేసిన ఆరోపణలపై ఇప్పటికే సిట్ రెండోసారి నోటీసు జారీ చేసినప్పటికీ మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ విచారణకు గైర్హాజరయ్యారు, నోటీసులు జారీ చేసిన ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నారో కూడా ఇంత వరకు ఆచూకిలేదని సిట్ అధికారులు అంటున్నారు.
ఇప్పుడు మూడవ సారి మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణకు నోటీసు జారీ చేయడానికి సిట్ అధికారులు సిద్దం అయ్యారు. మరోవైపు ఇంటి పనిమనిషిని దుర్భాషలాడారనే ఆరోపణలపై మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణకు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో కేసు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోయారని తెలిసింది.

ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్యాండల్ కేసు వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే దానిపై సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పుడు మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ మీద మరో కేసు నమోదు కావడంతో ప్రజ్వల్ రేవణ్ణ మరింత ఉత్కంఠకు గురవుతున్నారని తెలిసింది. ప్రజ్వల్ రేవణ్ణకు రక్షణగా కేంద్ర ప్రభుత్వం నిలుస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్న సమయంలో ఈ కేసు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం హాసన్ జిల్లాలోని హలేనరసీపురలోని మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు, పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణకు కూడా విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారని తెలిసింది. రేపు అంటే శనివారం విచారణకు హాజరు కావాలని కూడా సిట్ అధికారులు భవాని రేవణ్ణకు ఆదేశించారని సమాచారం. స్థానిక పోలీసుల సహాయంతో భవాని రేవణ్ణకు సిట్ నోటీసులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ కేసు వ్యవహారంలో ఇప్పటి వరకు జేడీఎస్ నాయకులు, భవాని రేవణ్ణ, మాజీ మంత్రి రేవణ్ణ స్పందించలేదు.












Click it and Unblock the Notifications