మాజీ ముఖ్యమంత్రులపై దర్యాఫ్తు చేపట్టాలి: సుప్రీం
ఇనుప ఖనిజం కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు ధరం సింగ్, కుమారస్వామిల పాత్రపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా సుప్రీం కోర్టు సిట్‌ను (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) ఆదేశించింది.
బెంగళూరు: ఇనుప ఖనిజం కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు ధరం సింగ్, కుమారస్వామిల పాత్రపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా సుప్రీం కోర్టు సిట్‌ను (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) ఆదేశించింది.
మూడు నెలల్లో ఓ నివేదిక సమర్పించాలని కర్ణాటక పోలీసులకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి స్పష్టం చేసింది. మరో మాజీ సీఎం ఎస్‌ఎం కృష్ణకు ఉపశమనం కలిగిస్తూ దర్యాప్తుపై నిలుపుదల ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపింది.

ఈ కేసులో హైకోర్టు సహా ఇతర ఏ న్యాయస్థానమూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా నిలువరిస్తున్నట్లు జస్టిస్ పీసీఘోష్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
మాజీ ముఖ్యమంత్రులు పలువురు అధికారులతో కలిసి అటవీ భూమిని రిజిస్టర్లనుంచి తొలగించారనీ, భారీస్థాయిలో అక్రమంగా ఇనుప ఖనిజం తవ్వుకునేందుకు అనుమతించారని అబ్రహాం అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications