బిగ్ షాక్ : ట్రంప్‌పై తిరగబడుతోన్న రిపబ్లికన్ రెబల్స్..

ట్రంప్ పాలనపై విశ్వాసం లేని ఆరుగురు రిపబ్లికన్ పార్టీ రెబల్స్ ట్రంప్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది.

అమెరికా : అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్ పై సొంత పార్టీ నేతలే తిరగబడే పరిస్థితి వచ్చింది. ట్రంప్ పాలనపై విశ్వాసం లేని ఆరుగురు రిపబ్లికన్ పార్టీ రెబల్స్ ట్రంప్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా 37మంది రిపబ్లికన్లను ట్రంప్ కు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా రెబల్స్ కోరినట్టు సమాచారం.

కాగా, అధ్యక్ష పదవిని చేపట్టడానికి 270 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు అవసరమవనున్న నేపథ్యంలో.. ఈ అసమ్మతి సెగలు ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అయితే రిపబ్లికన్ల ఆధిక్యం ఎక్కువగా ఉన్న హౌజ్ ఆఫ్ రిజ్రజెంటేటివ్స్ లో ట్రంప్ కు పూర్తిస్థాయి మద్దతు ఉండడంతో ఎలక్టోరల్ ఓట్ల ప్రభావం ఆయన అధ్యక్ష పదవిపై ప్రభావం చూపే అవకాశాలు లేవనే చెబుతున్నారు.

six rebel electors have signed an agreement to try to block donald trump

ఇకపోతే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్లు 290 ఎలక్టోరల్ కాలేజ్ స్థానాలు కైవసం చేసుకోగా.. డెమెక్రటిక్ పార్టీ 232 ఎలక్టోరల్ స్థానాలను దక్కించుకున్న సంగతి తెలిసిందే. 228ఏళ్ల అమెరికన్ ఎన్నికల చరిత్రలో ఇప్పటిదాకా 71మంది ఆయా పార్టీల రెబల్స్ అధ్యక్ష అభ్యర్థులపై వ్యతిరేక గళం వినిపించారు.

ట్రంప్‌కు వ్యతిరేకంగా సొంత పార్టీలో మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నమైన వారిలో కొలరాడో ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్ మైఖేల్ ఉన్నారు. దేశాన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లడంలో.. దేశ రక్షణ విషయంలో ట్రంప్‌పై విశ్వాసం లేదంటున్నారు మైఖేల్. మరో ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుడు సైతం ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. దేశంలో సంక్షోభం తలెత్తే పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+