Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పూణెలో ప్రమాదం: 6గురు టెక్కీలు మృతి, పెళ్ళికి వస్తుండగా ఘటన

అహ్మద్ నగర్ నుండి తిరిగివస్తోన్న టెక్కీలు రోడ్డు ప్రమాదంలో మరణించారు.వాటర్ ట్యాంకర్ మినీ బస్సును వెనుక నుండి ఢీకొట్టడంతో 6 చనిపోయారు. పూణెలో ఈ ఘటన చోటుచేసుకొంది.

పూణె: తోటి ఉద్యోగి వివాహనికి హజరై తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం ఆరుగురు టెక్కీల ప్రాణాలను హరించేసింది. అప్పటి వరకు ఆనందంగా గడిపిన స్నేహితులు ఈ ప్రమాదంతో షాక్ కు గురయ్యారు.

15 మండి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తమ తోటి ఉద్యోగి వివాహనికి అహ్మద్ నగర్ నుండి మినీ బస్సులో తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురై ఆరుగురు మరణించారు. పూణెలో వాటర్ ట్యాంకర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుప్రయాణీస్తున్న మినీ బస్సు ఢీకొంది.

పూణెలోని వాఘోలి వద్ద ఆదివారం రాత్రి 7 గంటలకు జరిగింది. పూణె అహ్మద్ నగర్ హైవేపై ఈ ఘటన చోటుచేసుకొంది. స్పీడ్ గా వచ్చిన వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి డివైడర్ నుదాటి మినీ బస్సును ఢీకొట్టింది.

Six techies killed as tanker jumps divider, crashes into minibus

అంతేకాదు మినీ బస్సును ఢీకొట్టిన తర్వాత బస్సు వెనుకే వస్తోన్న కారును కూడ ఢీకొట్టింది ట్యాంకర్ .అయితే ఈ ప్రమాదం నుండి కారు, కారులో ప్రయాణీస్తున్న ఇద్దరు కూడ సురక్షితంగా బయటపడ్డారు.

కారు స్వల్పంగా దెబ్బతింది. 15 మంది టెక్కీలు తమ తోటి ఉద్యోగి వివాహనికి అహ్మద్ నగర్ సోనై ప్రాంతానిమినీ బస్సును అద్దెకు తీసుకొన్నారు. వివాహనికి హజరై తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

మార్గమద్యలోని షానీ శింగాపూర్ దేవాలయాన్ని కూడ వారు సందర్శించారు. వైభవ్ మానే, మనేష్ పవర్, నాపూర్ సాహూ, నిఖిల్ జాదవ్, బోసారి, అక్షయ్ దబోడే, సంఘ్వి , వైషల్ చావన్ లు మరణించారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అనుశ్రీభగ్వాడే వాఘోలిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. రాత్రి 11 గంటల సమయంలో సాసూన్ ఆసుపత్రిలో పోస్ట్ మార్టమ్ నిర్వహించారు.

డివైడర్ ను ఢీకొట్టి మినీ బస్సు వెనుక భాగం నుండి వాటర్ ట్యాంకర్ ఢీకొట్టిందని మినీబస్సులో ప్రయాణీస్తున్న రంజీత్ అనే టెక్కీ చెప్పాడు. అయితే తాను డ్రైవర్ కు వెనుక సీటులో కూర్చొన్నందున ఈ ఘటన నుండి బతికి బయటపడ్డానని రంజీత్ చెప్పాడు. బస్సు వెనుక భాగంలో కూర్చొన్నందునే వారంతా చనిపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+