''ముఖ్యమంత్రిని నేనే, కృష్ణ చేరికతో అదనంగా 40 సీట్లు మాకే''

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు:ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘనవిజయం సాధించిన బిజెపి కర్ణాటక రాష్ట్రంలో మరోసారి అధికారపీఠాన్ని దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ ఎం కృష్ణ బిజెపిలో చేరడంతో ఆ పార్టీ విజయావకాశాలు మరింత మెరుగయ్యాయని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలో 224 అసెంబ్లీ సీట్లున్నాయి.అయితే 150 అసెంబ్లీ సీట్లు సాధించిన పార్టీ ఆ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోనుంది.

Yeddyurappa

అయితే కర్ణాటక రాష్ట్రంలో 150 అసెంబ్లీ సీట్లు సాధించడం తమకు కష్టం కాదని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బిఎస్ యుడ్యూరప్ప అభిప్రాయపడ్డారు.అయితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ ఎం కృష్ణ బీజేపీలో చేరడం అదనంగా 40 సీట్లు గెలుస్తోందని యడ్యూరప్ప చెప్పారు.

బీజేపిలోకి కృష్ణ చేరడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని యడ్యూరప్ప చెప్పారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన సయంలో బెంగుళూరు అభివృద్ది చెందిందన్నారు.

బెంగుళూరు ప్రజల్లో ఆయనకు మంచి ఇమేజ్ ఉందన్నారు. ఇది తమకు ఉపయోగపడుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారధ్యంలో కర్ణాటకలో బీజేపీని గెలిపిస్తామన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో బీజేపీని గెలిస్తే తాను ముఖ్యమంత్రిని అవుతానని యడ్యూరప్ప చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
bjp leadership has already announced a mission 150 in karnataka. the state party president Yeddyurappa, who led the bjp to victory in 2008, claims getting 150 out of 224 won't be a difficult task.
Please Wait while comments are loading...