ఏపీ మీదుగా పట్టాలెక్కిన బెంగళూరు వందే భారత్ స్లీపర్: 8 హాల్ట్ స్టేషన్లు

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల దూకుడు కొనసాగుతోంది. సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పలు రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి. సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు, వేగం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది.

ఈ పరిణామాల మధ్య ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా పట్టాలెక్కుతున్నాయి. హౌరా-కామాఖ్య మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ఇదివరకే అందుబాటులోకి రానుంది. దీన్ని మరింత విస్తరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. నూతన మార్గాల్లో వీటిని ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో మరో వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ నేడు పట్టాలెక్కింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొద్దిసేపటి కిందటే జెండా ఊపి ప్రారంభించారు.

SMVT Bengaluru- Mumbai Vande Bharat Sleeper Express Flagged off travel time cut to around 16 hours
  • సర్ ఎం విశ్వేశ్వరాయ టెర్మినల్ బెంగళూరు- ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ ముంబై మధ్య రాకపోకలు సాగించే స్లీపర్ రైలు ఇది.
  • సోమవారం మినహా మిగిలిన అన్ని రోజులూ సాయంత్రం 7:45 నిమిషాలకు బెంగళూరు నుంచి బయలుదేరే నంబర్ 27652 వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు ఉదయం 11:55 నిమిషాలకు ముంబైకి చేరుకుంటుంది.
  • మంగళవారం మినహా మిగిలిన అన్ని రోజులూ రాత్రి 8:10 నిమిషాలకు ముంబై నుంచి బయలుదేరే నంబర్ 27651 వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది.
నార్త్ కారిడార్ బుల్లెట్ రైల్ కు ప్రధాని మోదీ ఆమోదం
నార్త్ కారిడార్ బుల్లెట్ రైల్ కు ప్రధాని మోదీ ఆమోదం

బెంగళూరు- ముంబై మధ్య ఎనిమిది స్టేషన్లల్లో మాత్రమే దీనికి హాల్ట్ సౌకర్యం ఉంది. ఇందులో ఏపీలో రెండు, కర్ణాటకలో మూడు, మహారాష్ట్రలో మూడు స్టేషన్లు ఉన్నాయి. బెంగళూరు నుంచి బయలుదేరే వందే భారత్ స్టీపర్ ఎక్స్ ప్రెస్ ఆ తర్వాత ఆగేది అనంతపురంలో మాత్రమే. దీని తర్వాత గుంతకల్లులో దీనికి హాల్ట్ సౌకర్యం ఉంది. అనంతరం రాయచూరు, యాద్గిర్, కలబురగి, షోలాపూర్, పూణె, కల్యాణ్ లల్లో ఆగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+