అనాధపిల్లల కోసం రియల్ హీరో సోను సూద్ ఇంటర్నేషనల్ స్కూల్.. హ్యాట్సాఫ్ సోను సూద్!!
సోనూ సూద్... రీల్ లైఫ్ విలన్.. రియల్ లైఫ్ హీరో. సోను సూద్ తాను చేసే సేవ కార్యక్రమాలతో దేశంలో మంచి పేరు సంపాదించారు. కరోనా మహమ్మారి సమయంలో సోనుసూద్ సేవలు దేశ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. అంతగా కరోనా మహమ్మారి సమయంలో వలస కార్మికులకు దేవుడిగా సోనుసూద్ పనిచేశారు. నిరుపేదలకు, అవసరం ఉన్నవారికి సేవ చేయడమే కాకుండా, తనలాగే ఎంతోమందికి సేవ చేయడానికి కావలసిన స్ఫూర్తిని ఇచ్చారు సోనూసూద్.
ఇక ఆ ఫలితంగా బీహార్ కు చెందిన ఒక యువకుడు సోనూసూద్ పై అభిమానంతో, ఆయన ఇచ్చిన ప్రేరణతో అనాధ పిల్లల కోసం సోనూ సూద్ ఇంటర్నేషనల్ పాఠశాలను ప్రారంభించాడు. ఆ స్కూల్లో ప్రస్తుతం వందమంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక ఈ విషయం తెలిసిన సోనుసూద్ నేరుగా ఆ పాఠశాలకు వెళ్లి అక్కడ యువకుడితో మాట్లాడి పిల్లలకు మరింత మెరుగైన విద్య, వసతి సౌకర్యం కల్పించడం కోసం కావలసిన సహాయాన్ని చేశారు.

Extremely grateful to be associated with the Birendra Kumar Mahato and the good work he’s doing by providing food and education for orphaned children. At the Sonu Sood International School - we aim to provide the students with quality education and we will also be building a new… pic.twitter.com/hPgQH4fq9K
— sonu sood (@SonuSood) May 29, 2023
సోనూ సూద్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో - విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కొత్త పాఠశాల భవనాన్ని కూడా నిర్మిస్తామని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇకపై ఆ పిల్లల బాధ్యతలోనూ తాను భాగస్వామిని అవుతానని సోను సూద్ తెలిపారు. సోనుసూద్ ఇలాంటి అనేక మంచి సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి ఆదర్శంగా నిలవటమే కాదు ఎన్నో జీవితాలలో వెలుగులు నింపుతున్నారు. హ్యాట్సాఫ్ సోనూ సూద్.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications