భారతీయ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
భారతీయ రైల్వేలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 81 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు 1 ఫిబ్రవరి 2019 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: సౌత్ వెస్ట్రన్ రైల్వేలు
మొత్తం పోస్టుల సంఖ్య : 81
పోస్టు పేరు: సీనియర్ టెక్నికల్ అసోసియేట్, జూనియర్ టెక్నికల్ అసోసియేట్
జాబ్ లొకేషన్ : కర్నాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, తమిళనాడు
దరఖాస్తులకు చివరి తేదీ : 1 ఫిబ్రవరి 2019
విద్యార్హతలు
-> సీనియర్ టెక్నికల్ అసోసియేట్: ఇంజనీరింగ్ డిగ్రీ
జూనియర్ టెక్నికల్ అసోసియేట్: మూడేళ్ల ఇంజనీరింగ్ డిప్లొమా

వయస్సు:
సీనియర్ టెక్నికల్ అసోసియేట్: 20 నుంచి 33 ఏళ్లు
జూనియర్ టెక్నికల్ అసోసియేట్: 18 నుంచి 33 ఏళ్లు
వేతనం :
సీనియర్ టెక్నికల్ అసోసియేట్: నెలకు రూ. 32000/-
జూనియర్ టెక్నికల్ అసోసియేట్: నెలకు రూ. 25000/-
అప్లికేషన్ ఫీజు :
ఎస్సీ/ఎస్టీ/మహిళలు/దివ్యాంగులు: ఫీజు నుంచి మినహాయింపు
ఇతరులు: రూ. 100/-
ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 10 జనవరి 2019
దరఖాస్తులకు చివరి తేదీ : 1 ఫిబ్రవరి 2019












Click it and Unblock the Notifications