ప్రపంచంలో ఫస్ట్ పైలెట్ ఎవరో తెలుసా? ఆయన ఫ్లైయింగ్ టెక్నిక్స్‌పై పరిశోధనకు సిద్ధమైన శ్రీలంక
Recommended Video
కొలంబో : ప్రపంచంలో మొట్టమొదటి పైలెట్ ఎవరు? ఈ ప్రశ్నకు శ్రీలంక ప్రభుత్వం ఠక్కున సమాధానం రావణాసురుడు. ఐదు వేల ఏళ్ల క్రితమే ఆయన ఆకాశయానం చేశారని బల్లగుద్ది మరీ చెబుతోంది. ఇదేదో పురాణేతిహాసం కాదని.. మొట్టమొదట విమానాన్ని నడిపింది రావణుడేనని చెబుతోంది. ఈ విషయాన్ని తొందరలోనే నిరూపిస్తామంటూ, అప్పట్లో విమానం నడిపేందుకు ఆయన వాడిన టెక్నిక్స్‌పై అధ్యయనానికి సిద్ధమైంది.
రావణాసురుడు అపార మేథావి అని, ఆయనే మొదటిసారి విమానాన్ని నడిపాడని, శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ వైస్ ఛైర్మన్ శశి దనతుంగే చెబుతున్నారు. ఇది కట్టుకథ కాదని, అక్షర సత్యమని చెబుతున్నారు. ఈ అంశంపై సమగ్ర అధ్యయనం అవసరమని మరో ఐదేళ్లలో ఈ విషయాన్ని నిరూపిస్తామి చెబుతున్నారు.

ఈ అంశంపై చర్చించేందుకు శ్రీలంకలోని అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రమైన భండారనాయకేలో పలువురు ప్రముఖులు సమావేశమయ్యారు. ఏవియేషన్ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు చరిత్రకారులు, ఆర్కియాలజిస్టులు, సైంటిస్టులు, జియాలజిస్టులు ఈ భేటీలో పాల్గొన్నారు. 5వేల ఏళ్ల క్రితం రావణుడు తొలిసారి శ్రీలంక నుంచి భారత్‌కు విమానయానం చేశాడని వారంతా నిర్ణయానికొచ్చారు. రావణుడు సీతను అపహరించుకుపోవడాన్ని వారు కొట్టిపారేశారు. అది భారతీయులు చెబుతున్న కట్టుకథ అని రావణుడంతటి గొప్ప రాజు ఇంకెవరు లేరని అంటున్నారు.
శ్రీలంకలో రావణాసురుడి గురించి ఈ మధ్యకాలంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇటీవలకాలంలో అక్కడి ప్రభుత్వం స్పేస్ మిషన్‌లో భాగంగా పంపిన శాటిలైట్‌కు రావణ అని పేరు పెట్టింది. చాలా మంది లంకేయులు రావణుడు దయాగుణం కలవాడని, మేధావి అని నమ్ముతున్నారు. భారత పురాణాల్లోనూ రావణుడు బ్రాహ్మనుడని, పండితుడని చెబుతున్నాయి.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications