పది ఉద్యోగాల కోసం పోటెత్తిన నిరుద్యోగులు, తోపులాట (వీడియో)

గాంధీనగర్: దేశంలో నిరుద్యోగిత ఎంత తీవ్రంగా ఉందో ఈ ఘటన చూస్తే తెలుస్తోంది. ఏటా లక్షలాది మంది విద్యావంతులు తమ విద్యను పూర్తి చేసి బయటకు వస్తుండగా.. ఆ స్థాయిలో మాత్రం ఉద్యోగాలు అందుబాటులో ఉండటంతో లేదు. దీంతో తీవ్ర నిరుద్యోగిత ఏర్పడుతోంది. ఈ క్రమంలో తమ విద్యార్హతకు సంబంధం లేని ఉద్యోగాలకు కూడా భారీ ఎత్తున నిరుద్యోగులు పోటీ పడుతున్నారు.

తాజాగా, ఇలాంటి ఘటనే గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో ఉద్యోగం కోసం వందలాది మంది నిరుద్యోగులు బారులు తీరడం గమనార్హం. ఎక్కువ సంఖ్యలో నిరుద్యోగులు రావడంతో తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొందరు నిరుద్యోగులు కిందపడిపోయారు.

Stampede-like situation in as hundreds turn up for Bharuch hotel job interview

గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్ అంకలేశ్వర్‌లోని లార్డ్స్ ప్లాజా హోటల్‌లో 10 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. హోటల్ లో పనిచేసేందుకు అవసరమైన అర్హత, పని అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో కంపెనీ పేర్కొంది.

జులై 9న ఇందుకోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ చేపట్టింది. కేవలం పది ఉద్యోగాల కోసం వందలాది మంది నిరుద్యోగులు ఎగబడ్డారు. దరఖాస్తులు ఇచ్చేందుకు యువకులు భారీ ఎత్తున పోటెత్తారు.

ఈ క్రమంలో తోపులాట జరగడంతో హోటల్ రెయిలింగ్ విరిగిపోయింది. అయితే, అదృష్టవశాత్తూ ఈ తొక్కిసలాటలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో దేశంల నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారో అంటూ నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో నిరుద్యోగం బాగానే ఉందని కొందరు.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉందని మరికొందరూ కామెంట్లు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+