చెన్నైకి భారీ ప్రాజెక్ట్ ను ఎగరేసుకెళ్లిన సీఎం విజయ్

ప్రముఖ అంతర్జాతీయ కాఫీ మార్కెటింగ్ దిగ్గజం స్టార్‌బక్స్ తమిళనాడు గడప తొక్కింది. దేశంలో తన మొట్టమొదటి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC)ను నెలకొల్పబోతోంది. చెన్నైలో దీన్ని ఏర్పాటు చేయబోతోంది. అమెరికా వెలుపల తన సాంకేతిక విభాగాలు, సాఫ్ట్‌వేర్ నెట్‌వర్క్‌, ఐటీ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే ప్రధాన లక్ష్యంతో ఈ ఫార్చ్యూన్ 500 మల్టీనేషనల్ కంపెనీ చెన్నైని తన గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా ఎంపిక చేసుకుంది.

ఈ జీసీసీ ఏర్పాటు కోసం ఈ మధ్యాహ్నం.. సచివాలయంలో ముఖ్యమంత్రి విజయ్ సమక్షంలో పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది స్టార్ బక్స్. దీనిద్వారా దాదాపు 800 నుంచి 1,000 మంది వరకు ఐటీ నిపుణులకు భారీ వేతనాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇటీవలే అమెరికాకు చెందిన ప్రముఖ హెల్త్‌కేర్, ఫార్మసీ రంగాల దిగ్గజం వాల్‌గ్రీన్స్ కూడా చెన్నైలో తన యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Starbucks to Launch Its 1st India Global Capability Centre in Chennai MoU with CM Vijay Hiring Tech Pros

దీని తర్వాత అతి కొద్దిరోజుల్లోనే స్టార్‌బక్స్ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం గైడెన్స్ టీఎన్- స్టార్‌బక్స్ ప్రతినిధుల మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరింది. విజయ్ సమక్షంలో వీటిపై సంతకాలు చేశారు. ఈ ఎంఓయూ ప్రకారం.. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌ భాగస్వామ్యంతో నడుస్తున్న స్టార్‌బక్స్ రిటైల్ వ్యాపారంతో ఎటువంటి సంబంధం లేకుండా ఈ నూతన కేపబిలిటీ సెంటర్ పూర్తిగా స్వతంత్రంగా పనిచేస్తుంది.

ఐఐటీ- బీ ప్రొఫెసర్ పై వేటు: చదివింది ఏలూరు, కాకినాడల్లో
ఐఐటీ- బీ ప్రొఫెసర్ పై వేటు: చదివింది ఏలూరు, కాకినాడల్లో

ప్రస్తుతం అమెరికాలోని సియాటెల్, నాష్‌విల్లేల్లో స్టార్‌బక్స్ ఇంటర్నేషనల్ డిజిటల్ టెక్ కార్యాలయాలు ఉన్నాయి. వాటికి చెన్నై ఐటీ కేంద్రం వెన్నుదన్నుగా నిలవనుంది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌తో జాయింట్ వెంచర్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా విజయవంతంగా నడుస్తున్న దాదాపు వందలాది రిటైల్ కాఫీ అవుట్ లెట్ల రోజువారీ నిర్వహణతో ఎలాంటి సంబంధం ఉండదు దీనికి. ఈ నూతన కేపబిలిటీ సెంటర్ ప్రత్యేకంగా అంతర్జాతీయ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్ ఆపరేషన్లపై దృష్టి సారిస్తూ పూర్తి స్వతంత్ర సంస్థగా నడుస్తుంది.

శాప్ కార్యాలయంలో స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ దాడి..!!
శాప్ కార్యాలయంలో స్పోర్ట్స్ కోటా టీచర్లపై వైసీపీ దాడి..!!

ఈ కార్యక్రమంలో స్టార్‌బక్స్ గ్లోబల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆనంద్ వరదరాజన్ పాల్గొన్నారు. ఐఐటీ- మద్రాస్ లో చదువుకున్నారాయన. చెన్నైతో తనకు ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఐటీ డెవలప్మెంట్ కు తమిళనాడు ప్రభుత్వం అందిస్తోన్న సహకారం, అధునాతన మౌలిక వసతులు తమ ఇంటర్నేషనల్ డిజిటల్ కార్యకలాపాల విస్తరణకు ఎంతో దోహదపడతాయని, ఇక్కడి నుంచే ఆసియాలో తమ కార్యాలయాలను విస్తరించుకుంటామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+