ఇన్ఫోసిస్ టెక్కీ హత్య, కులం కార్డ్: 'రామ్ కుమార్‌ని ఎవరూ కాపాడలేరు'

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఇన్ఫోసిస్ టెక్కీ స్వాతి హత్య కేసు విచారణలో భాగంగా ఈ నెల 11న పుళల్‌ సెంట్రల్‌ జైల్లో దోషి నిర్ధారణ పరీక్ష జరిపేందుకు పోలీసులు ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారు. గత జూన్ 24 ఉదయం రైలు కోసం నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో స్వాతి హత్య చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

'స్వాతి హత్య పట్ల రామ్‌కుమార్ పశ్చాత్తాపం: కోపం తగ్గలేదు'

ఆ రైల్వే స్టేషన్ సమీపంలోని ఇళ్లపైని సీసీటీవీ కెమెరాలలో నమోదైన హంతకుడి వీడియో దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన చెన్నై మహానగర పోలీసులు వారం రోజుల్లోనే నిందితుడు రామ్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతను అతను జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నాడు.

swathi

కోర్టు ఆదేశాల మేరకు రామ్ కుమార్‌ను గట్టి పోలీసు భద్రత మధ్య పుళల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. అదే సమయంలో రామ్ కుమార్‌ అనుమతి తీసుకోకుండానే నగరానికి చెందిన ఇద్దరు లాయర్లు బెయిలు పిటిషన వేయడం, ఆ పిటిషన విచారణ సందర్బంగా కోర్టులో సుమారు 15 మంది మహిళాన్యాయవాదులు బెయిల్ ఇవ్వరాదంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఆ లాయర్లు కేసు నుండి తప్పుకున్నారు.

ఈ పరిస్థితులలో పుళల్‌ సెంట్రల్‌ జైలులో ఈ నెల 11న దోషి నిర్ధారణ పరీక్షను జరిపేందుకు జైలు అధికారులు తగు ఏర్పాట్లు చేపడుతున్నారు. స్వాతిని కత్తితో చంపింది రామ్ కుమార్‌ కాదని, అనవసరంగా అతడిపై తప్పుడు కేసు మోపారనీ కొన్ని కుల సంఘాల నాయకుల నుండి ఆరోపణలు వచ్చాయి.

అమాయకుడ్ని: ఇన్ఫోసిస్ హత్య టెక్కీపై రామ్ కుమార్ యూటర్న్

అయితే చెన్నై మహానగర పోలీసులు మాత్రం.. రామ్ కుమార్‌ హంతకుడనేందుకు తమ వద్ద పలు ఆధారాలు ఉన్నాయని, అతడు బస చేసిన గదిలో స్వాతి రక్తంతో తడిసిన చొక్కా, కత్తిపై అతడి చేతి ముద్రలు, హత్య చేస్తుండగా చూసిన సాక్షులు.. ఇలా అన్ని రకాల సాక్ష్యాధారాలను సేకరించిన మీదటే అతడిని అరెస్ట్చేశామని చెబుతున్నారు.

ఇన్ని అధారాలు ఉండగా అతను నిర్ధోషి అని లాయర్లు ఎలా వాదిస్తారని పోలీసులు అంటున్నారు. రామ్ కుమార్‌ను ఎవరూ కాపాడలేరని చెబుతున్నారు. హత్య చేసినట్లు అతనే ఒప్పుకున్నట్లు ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు.

నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో స్వాతిని రామ్ కుమార్‌ నరికి చంపుతుండగా చూసిన కొందరు సాక్షులను జైలుకు తీసుకెళ్లి ఈ నెల 11న దోషి నిర్ధారణ పరీక్ష జరుపనున్నారు. పుళల్ సెంట్రల్‌ జైలులో రామ్ కుమార్‌ను గట్టి పోలీసు భద్రత మధ్య ఓ చోట వివిధ భంగిమలలో నిలబెట్టి వరుసగా సాక్ష్యులను పంపి హంతకుడు అతడేనా కాదా అని నిర్ధారించే సన్నాహాలు నిర్వహించనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Identification parade will be held in Puzhal jail to identify the culprit in the Swathi murder case.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి