వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు షాక్: ఢిల్లీలో పీవీ మెమోరియల్ ఘాట్‌కు ఎన్డీఏ ప్లాన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలుగువాడైన మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు చనిపోయినప్పుడు కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసినప్పటికీ.. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి పీవీ కీర్తిని తిరిగి పునరుద్ధరించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో స్మృతి చిహ్నం ఏర్పాటు చేసి.. దేశంలో ఆర్థిక సంస్కరణలకు బాటలు వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీని గౌరవించాలనుకుంటోంది.

ఈ క్రమంలో ఏక్తాస్థల్ సమాధి కాంప్లెక్స్‌లో పీవీ స్మారకంగా ఘాట్ నిర్మించేందుకు అనుమతి కోసం గతవారం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కేబినెట్‌కు ఓ ప్రతిపాదన పంపిందని సమాచారం. పీవీ స్మారక ఘాట్ పాలరాతితో ఉంటుందని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో పుట్టి ప్రధాని అయిన పీవీకి స్మారక చిహ్నంగా ఘాట్ నిర్మించాలని కోరుతూ నిరుడు అక్టోబర్‌లో చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ఓ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.

Take this, Congress: NDA govt plans a memorial for former PM Narasimha Rao

ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ ప్రభుత్వం దేశ రాజధానిలో స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయంతో, సొంత పార్టీ నేతను గౌరవించుకోలేని కాంగ్రెస్ పార్టీకి తీవ్ర అవమానం ఎదురుకానుంది.

పీవీ చనిపోయినప్పుడు దేశ రాజధానిలో ఘాట్ ఏర్పాటు చేయకుండా కాంగ్రెస్ అధినాయకత్వమే అడ్డుకుందనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, కాంగ్రెస్ వాడైనప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడంలో కీలక భూమిక పోషించిన నేతకు సముచిత గౌరవం కల్పించి ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోనుంది.

English summary
While the Congress may have disowned him even before his death, the NDA government plans to restore full glory to late Prime Minister P V Narasimha Rao with a memorial honouring him as the architect of the country’s economic reforms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X