విజయ్ మరో షాకింగ్..! రాజీవ్ గాంధీ హంతకుడికి ఇలా ..!
తమిళనాడు సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టి, తన విన్నూత్న ఆలోచనలతో ఆకట్టుకుంటున్న టీవీకే అధినేత విజయ్ (CM Vijay) ఇవాళ మరో సంచలనం రేపారు. శ్రీలంకలతో తమిళుల కోసం ఎల్టీటీటీ ఉగ్రవాద సంస్థను స్థాపించి భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని తన అనుచరులతో హత్య చేయించి, ఆ తర్వాత తానూ హతమైన వేలుపిళ్లై ప్రభాకరన్ (velupillai prabhakaran) కు విజయ్ నివాళులు అర్పించారు. అంతే కాదు శ్రీలంకలోని తమిళులకు సంఘీభావం తెలిపారు.
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం వ్యవస్థాపకుడు, ప్రపంచంలోని అత్యంత క్రూరమైన గెరిల్లా నాయకులలో ఒకరైన వేలుపిళ్లై ప్రభాకరన్‌ను 2009 మే 18న శ్రీలంక సైన్యం హతమార్చిన శ్రీలంకలోని ముల్లివైక్కల్‌ను విజయ్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఎక్స్ లో పెట్టిన పోస్టులో విజయ్.. "మేము ముల్లివైక్కల్ జ్ఞాపకాలను మా హృదయాలలో పదిలపరుచుకుంటాము! సముద్రం అవతల నివసిస్తున్న మా తమిళ బంధువుల హక్కుల కోసం మేము ఎల్లప్పుడూ సంఘీభావంతో నిలబడతాము!" అని తెలిపారు.

முள்ளிவாய்க்கால் நினைவுகளை இதயத்தில் ஏந்துவோம்! கடல் கடந்து வாழும் நம் தமிழ்ச் சொந்தங்களின் உரிமைகளுக்காக எப்போதும் துணை நிற்போம்!
— TVK Vijay (@TVKVijayHQ) May 18, 2026
1991లో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్యలో ఎల్‌టిటిఇ పాత్ర కారణంగా, ఆ సంస్థపై భారత్ పై నిషేధం ఉంది. ఆ హత్యలో ఎల్‌టిటిఇ అధిపతి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. వివక్షకు గురవుతున్నామని ఆరోపిస్తూ శ్రీలంక తమిళులకు ప్రత్యేక మాతృభూమి కావాలనే డిమాండ్లతో ప్రారంభమైన శ్రీలంక సంఘర్షణ, ఆ తర్వాత దాదాపు మూడు దశాబ్దాల పాటు కొనసాగిన సుదీర్ఘ జాతి సంఘర్షణగా మారింది. తమిళనాడులోని రాజకీయ పార్టీలు తమిళులను ఆకట్టుకునే ప్రయత్నాలలో ప్రభాకరన్ పోరాటం తరచుగా ఒక ప్రతిధ్వనిగా నిలిచింది. అయినప్పటికీ అన్నాడీఎంకే, డీఎంకే వంటి ప్రధాన ద్రావిడ పార్టీలు, 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత ఈ అంశంపై జాగ్రత్తగా వ్యవహరించాయి. ఇప్పుడు విజయ్ మైనారిటీ ప్రభుత్వానికి, డీఎంకే మిత్రపక్షమైన ఎల్టీటీఈ 'విడుదలై చిరుతైగళ్ కచ్చి' బయటి మద్దతు ఉంది. ఈ సంస్థ ఎల్‌టీటీఈ అనుకూల వైఖరికి పేరుగాంచింది.














Click it and Unblock the Notifications