Tamil Nadu AI Survey: తమిళనాడులో క్లీన్ స్వీప్ ? విజేతను తేల్చేసిన ఏఐ..!
తమిళనాడు (Tamil Nadu)లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. ఎల్లుండితో ఎన్నికల ప్రచారం కూడా ముగియబోతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటరునాడిని తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ సర్వేలన్నింటినీ కలిపి ఏఐ (AI) తన అంచనాలను వెల్లడిస్తోంది. ఇందులో రాష్ట్రంలో ఈసారి కూడా ఓటర్లు క్లీన్ స్వీప్ తీర్పు ఇవ్వబోతున్నట్లు తేలిపోయింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు డీఎంకే (DMK)కూటమికి 77 శాతం అవకాశం ఉందని ఆ తర్వాతి స్థానాల్లో ఏఐఏడీఎంకే కూటమికి 15 శాతం, టీవీకేకు 9 శాతం అవకాశాలు ఉన్నట్లు పాలిమార్కెట్ ప్రిడిక్షన్ మార్కెట్ చూపిస్తోంది. వాస్తవానికి తాజాగా వెలువడిన సర్వేల్లో మెజార్టీ డీఎంకే కూటమికే మొగ్గు ఇచ్చాయి. జేవీసీ పోల్ వంటి కొన్ని సర్వేలు మాత్రం ఏఐఏడీఎంకే కూటమికి 131-150 సీట్లు, డీఎంకే 80-101 సీట్లు గెలుచుకుంటాయని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో మొత్తం సర్వేల సారాంశంగా ఏఐ ఇస్తున్న తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

తమిళనాడులో మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు డీఎంకే కూటమి చేస్తున్న ప్రయత్నాలకు తాజాగా కేంద్రం పార్లమెంట్ లో తెచ్చిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ఆజ్యం పోసింది. లోక్ సభ సీట్ల పెంపులో బీజేపీ తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందన్న వాదనను సీఎం ఎంకే స్టాలిన్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. చివరికి ఈ బిల్లు లోక్ సభలో వీగిపోవడంతో బీజేపీపై తమిళనాడు సాధించిన విజయంగా దీన్ని తమిళ పార్టీలు అభివర్ణిస్తున్నాయి. ఇదంతా అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి మైనస్ గా మారబోతోందని తెలుస్తోంది. ఇక విజయ్ కొత్త పార్టీ టీవీకే పలు చోట్ల డీఎంకే ఓట్లకు, సీట్లకు గండికొట్టబోతోందని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి.














Click it and Unblock the Notifications