treatment: చికిత్స కోసం వచ్చిన తస్లీమా, గంజాయి వ్యాపారం, లక్షల్లో డీలింగ్, క్లైమాక్స్ లో !
చెన్నై/కోల్ కత్తా: కోల్‌కతాకు చెందిన తస్లీమా బీబీ అలియాస్ తస్లీమా అనే మహిళ చెన్నైలో ఆయుర్వేద చికిత్స చేయించుకోవడానికి వచ్చింది. చెన్నైలోని తాంబరంలోని ఓ ఆయుర్వేద ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నది. తస్లీమాకు గంజాయి సేవించే అలవాటు ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తస్లీమా చెన్నైలో గంజాయి కొనుక్కుని సేవించింది.
కోల్‌కతాలో అతి తక్కువ ధరకు గంజాయి లభిస్తుందని, చెన్నైలో గంజాయి కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోందని, చికిత్స కోసం చెన్నై వచ్చిన ప్రతిసారీ గంజాయి ఎక్కువ డబ్బులు కొనుగోలు చెయ్యడం వేస్ట్ అనుకుంది. చెన్నైలో గంజాయి సరఫరా చేసి మరింత డబ్బు సంపాదించవచ్చు అని తస్లీమా అనుకుంది.

కోల్‌కతాలో తనకు తెలిసిన గంజాయి బ్రోకర్ ద్వారా భానీ మొత్తంలో గంజాయి కొనుగోలు చేసిన తస్లీమా రైలులో చెన్నైకి తీసుకొచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తస్లీమా క్రోంపేటతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయించడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో చెన్నైలోని రామాపురంకు చెందిన అశోక్ కుమార్ అనే యువకుడితో తస్లీమాకు పరిచయం అయ్యింది.
తస్లీమా, అశోక్ కుమార్ కలిసి కొన్నేళ్లుగా పోలీసులకు తెలియకుండా గంజాయి విక్రయిస్తున్నారు. కోల్‌కతాలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి చెన్నైలో అధిక లాభాలకు విక్రయించారు. కోల్‌కతా నుంచి తీసుకొచ్చిన గంజాయిని క్రోంపేట ప్రాంతంలో విక్రయించి అశోక్‌కుమార్ నుంచి అడ్వాన్స్ తీసుకుని కోల్‌కతా వెళ్లి గంజాయి కొనుగోలు చేస్తున్న తస్లీమా చికిత్స పేరుతో చెన్నై వచ్చి గంజాయి వ్యాపారం చెయ్యడం అలవాటు చేసుకుంది.
చెన్నైతోపాటు పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న అశోక్‌కుమార్ తదితరుల నుంచి లక్షల్లో అడ్వాన్ తీసుకున్న తస్లీమా వారికి గంజాయి ఇవ్వకుండా తప్పించుకుని తిరిగింది. అశోక్ కుమార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తస్లీమా అడ్డంగా చెన్నై సిటీ పోలీసులకు చిక్కిపోయింది. తస్లీమా నుంచి భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications