తెహెల్కా లైంగిక దాడి: తేజ్‌పాల్ అరెస్టుకు బ్రేక్
న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టుపై లైగింక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు కాస్త ఊరట లభించింది. తేజ్‌పాల్‌కు కోర్టు ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం 2:30 గంటల వరకు ముందస్తు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. రూ.20 వేల వ్యక్తిగత పూచికత్తుపై కోర్టు మధ్యంతర బెయిల్‌ను జారీ చేసింది. బెయిల్ పిటిషన్‌పై మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత కోర్టులో విచారణ జరుగనుంది.
ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తరుణ్ తేజ్‌పాల్ శుక్రవారం ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత పానాజీలోని సెషన్స్ కోర్టు ముందు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు తరుణ్ తేజ్‌పాల్ తరఫు న్యాయవాది రౌనఖ్ రావు చెప్పారు.

కాగా, శుక్రవారం ఉదయం తరుణ్ తేజ్‌పాల్‌ను అదుపులోకి తీసుకోవడానికి గోవా పోలీసులు ఢిల్లీలోని ఆయన నివాసానికి వచ్చారు. అతను అక్కడ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. తరుణ్ తేజ్‌పాల్ ఎక్కడ ఉన్నాడనే విషయం తనకు తెలియదని అతని భార్య పోలీసులకు చెప్పారు.
తరుణ్ తేజ్‌పాల్ ఎక్కడున్నాడనే విషయం తెలియడం లేదని గోవా పోలీసులు అన్నారు. శనివారం వరకు తనకు సమయం ఇవ్వాలని అంతకు ముందు తేజ్‌పాల్ చేసిన విజ్ఞప్తిని గోవా పోలీసులు తిరస్కరించి, అతని అరెస్టుకు మెజిస్ట్రేట్ నుంచి నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ పొందారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications