శివుడిలా తేజ్ ప్రతాప్.. ఇదివరకు శ్రీ కృష్ణుడి రూపంలోనూ ...

పాట్నా : మనకు విష్ణువు, శివుడు తెలుసు. వారు భగవంతులు, కానీ ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా వారి వేషదారణలో కనిపిస్తూంటారు. ఇది కొత్త కాదు .. ఇదివరకు చాలా సార్లు కనిపించారు కూడా.. శివుడు, శ్రీ కృష్ణుడి వేషధారణల్లో కూడా కనిపించాు. తాజాగా పాట్నాలో ఓ ఆలయంలో శివుడి వేషధారణలో ప్రత్యేక పూజలు చేశారు.

ఆయన ఆలయంలో ప్రత్యేకంగా కనిపించారు. షర్ట్ లేకుండా .. తలపై విభూతి పూసుకుని శివుడి ప్రతీరూపంలా ఆగుపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇప్పుడే కాదు పెళ్లికి ముందు కూడా ఇలాగే ప్రవర్తించారు. శివుడి రూపంలో తాను, తనకు కాబోయే భార్య ఐశ్వర్య పార్వతీ రూపంలో పాట్నాలో పోస్టర్లు వెలిశాయి. ఐశ్యర్వ ఆర్జేడీ నేత చంద్రికా రాయ్ కూతురు. ఆమె తాతా మాజీ సీఎం దరోగ ప్రసాద్ రాయ్ అనే సంగతి తెలిసిందే. తర్వాత గతేడాది కూడా పాట్నాలో శివుడిలా అలంకరించుకున్నారు.

Tej Pratap Yadav dresses up as Lord Shiv again, offers prayers at temple in Patna

శివుడిగానే కాదు యాదవుల ఆరాధ్య దైవం శ్రీ కృష్ణుడిలా కూడా తనను తాను అలంకరించుకున్నారు. 2017లో సాలువా, దానిపై బ్లూ జాకెట్ వేసుకొని కనిపించారు. చేతిలో పిల్లనగ్రోవి పట్టుకొని అందంగా ఉన్నారు. అంతేకాదు పండుగల సమయాల్లో కూడా శ్రీ కృష్ణుడి వేషంలో రబ్రీదేవి ఇంటి ముందు ఉంటారు. గత నెలలో తేజ్ ప్రతాప్ యాదవ్ తేజ్ సేనను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ సేన తన కార్యక్రమాలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+