మోదీ నమ్మిన బంటు నిర్మలా, జీతం ఎంత - ఆస్తులు, అప్పులు..!!
Union Budget 2025-26: నిర్మలా సీతారామన్. కేంద్ర ఆర్దిక మంత్రి. మరి కొద్ది రోజుల్లో అంటే ఫిబ్రవరి 1న 2025-26 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు. వరుసగా 8వ సారి నిర్మల బడ్జెట్ ప్రవేశ పెట్టటం ద్వారా అత్యధికంగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన వారిలో రెండో స్థానంలో నిలుస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీ రికార్డును సమం చేస్తున్నారు. కాగా, ఈ సారి నిర్మలా బడ్జెట్ పైన ఎందరికో ఎన్నో ఆశలు ఉన్నాయి. అదే సమయంలో దేశ ఆర్దిక పద్దులను చూసే నిర్మలా ఆదా యం.. ఆస్తులు.. అప్పుల లెక్కల పైన ఆసక్తి కనిపిస్తోంది. కానీ, లెక్కలు మాత్రం చాలా తక్కవే.
మోదీ నమ్మిన బంటుగా
ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ 1959 ఆగస్టు 18న జన్మించారు. 1984లో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్ పూర్తి చేసేందుకు ఆమె ఢిల్లీ వెళ్లారు. ఆమె తండ్రి భారతీయ రైల్వే ఉద్యోగి. జేఎన్‌యూలో చదువుతున్న సమయంలో నిర్మలా సీతారామన్ తన భర్త పరకాల ప్రభాకర్‌ను కలిశారు. భిన్నమైన రాజకీయ సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, ఈ జంట 1986లో వివాహం చేసుకున్నారు. వీరికి వాంగ్మయి అనే కుమార్తె ఉంది. ఆ క్రమంలోనే 2006లో నిర్మలా సీతా రామన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరి 2010లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అయ్యారు.

8వ సారి బడ్జెట్
2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడంతో నిర్మలా సీతారామన్ నరేంద్ర మోదీ కేబినెట్‌లో జూని యర్ మంత్రిగా నియమితులయ్యారు. ఇందిరాగాంధీ తర్వాత రక్షణ మంత్రి పదవిని చేపట్టిన రెండవ మహిళ. మోదీ ఎంతో కమ్మకం తో మే 31, 2019న సీతారామన్ ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. జూలై 5న సీతారామన్ తన తొలి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి వరుసగా బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ 10, పి.చిదంబరం 9, ప్రణబ్ ముఖర్జీ 8 ఎక్కవ సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రస్తుత బడ్జెట్ తో నిర్మలా సీతారామన్ ఎనిమిదో సారి ప్రవేశ పెట్టిన ఘనత సాధించనున్నారు.
జీతం - ఆదాయం
ఫోర్బ్స్ మ్యాగజైన్ 2019లో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల్లో నిర్మలా 34వ స్థానంలో నిలిచింది. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నెలవారీ జీతం, అలవెన్సులు కలుపు కొని దాదాపు రూ. 4 లక్షలు గా ఉంది. ఇతర క్యాబినెట్ మంత్రులతో పోలిస్తే దేశ నిర్మలా ఆస్తులు చాలా తక్కువ. ఆమెకు దాదాపు రూ.1.34 కోట్ల ఆస్తులున్నాయి. ఆమె, ఆమె భర్తకు చెందిన ఇంటి విలువ రూ.99.36 లక్షలు. ఇది కాకుండా సుమారు రూ.16.02 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి కూడా ఉంది. ఇక, ఈ సారి బడ్జెట్ లో నిర్మల ఎవరి పైన భారం మోపుతారో.. ఎవరికి వరం ప్రకటిస్తారనేది దేశ వ్యాప్తంగా ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications