పక్క రాష్ట్రం మీద ప్రేమ ? తెలంగాణతో డీల్ ఎందుకు ?, మాజీ సీఎం కొడుకు !
బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద బీజేపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీని ఓడించిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా మెజారిటీ సీట్లలో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్ణాటక ప్రభుత్వం తెలంగాణలో డీల్ కుదుర్చుకుని భారీ మొత్తంలో కమీషన్లు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నదని కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటకలో బియ్యం పంపిణి చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తోందని బీజేపీ ఎమ్మెల్యే బీఎస్. విజయేంద్ర అన్నారు. కర్ణాటకలో బియ్యం ఊహించినదానికంటే ఎక్కువగా పండుతున్నదని, ఆ విషయం కర్ణాటక ప్రజలు అందరికి తెలుసు అని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప కుమారుడు బీవై. విజయేంద్ర అన్నారు.

అయితే ఇటీవల కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ, చత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నదని, కర్ణాటకలో బియ్యం ఉంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లి బియ్యం ఎందుకు కొనుగోలు చెయ్యాలని బీజేపీ ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర ప్రశ్నించారు. కమీషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నదని బీవై. విజయేంద్ర ఆరోపించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీ ఐదు ఉచిత హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీవై. విజయేంద్ర ఆరోపించారు. ఇచ్చిన హామీలు నేరవేర్చలేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నానా తంటాలు పడుతున్నదని, ఇదే సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మతమార్పిడి నిషేధ చట్టం ఎత్తి వేయడానికి ప్లాన్ చేసిందని మాజీ సీఎం కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర ఆరోపించారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేరవేర్చకపోతే కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని బీవై. విజయేంద్ర హెచ్చరించారు. కర్ణాటకలో పండిన బియ్యం కొనుగోలు చెయ్యలని, తెలంగాణ, చత్తీస్ గఢ్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి బియ్యం కొనుగోలు చెయ్యడానికి ప్రయత్నిస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వాన్ని బీఎస్, విజయేంద్ర హెచ్చరించారు.












Click it and Unblock the Notifications