లవ్ మ్యారేజ్, భార్య గర్బతి, నడిరోడ్డులో భార్యను హెల్మెట్ తో కొట్టి చంపేసి సినిమా స్టోరీ చెప్పిన భర్త

యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కూతురి లవ్ స్టోరీ తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెకు వేరే యువకుడితో పెళ్లి చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా పెళ్లి చేసుకోవడానికి యువతి అంగీకరించలేదు. పెద్దలను ఎదిరించిన యువతి ఆమె ప్రేమించిన ప్రియుడిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న భార్యను తలకు వేసుకునే హెల్మెట్ తోనే కొట్టి చంపేసిన భర్త ఓ సినిమా స్టోరీ చెప్పాడు.

కర్ణాటకలోని దావణగెరె జిల్లాలోని చెన్నగిరి తాలుకాలోని నుగ్గిహళ్లి క్రాస్ భార్యను చంపేసిన భర్త ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని అందరిని నమ్మించాడు. చెన్నగిరి తాలుకాలోని హోసూరులో యశోధా (24) అనే యువతి నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం తిప్పేష్ అనే యువకుడితో పరిచయం పెంచుకున్న యశోధా తరువాత అతని ప్రేమలో పడింది.

The husband killed his love marriage wife by hitting her with a helmet in Karnataka.

మూడు సంత్సరాల నుంచి తిప్పేష్, యశోధా హ్యాపీగా తిరుగుతున్నారు. ఇప్పటికే యశోధా, తిప్పేష్ సినిమాలు, షికార్లు, విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేశారు. కూతురు యశోధా లవ్ స్టోరి ఆమె తండ్రికి తెలిసింది. మన కులంలోని యుకుడితోనే యశోధా పెళ్లి చెయ్యాలని ఆమె తండ్రి డిసైడ్ అయ్యి కొన్ని పెళ్లి సంబంధాలు చూశాడు. అయితే కుటుంబ సభ్యులు చూపించిన యువడిని పెళ్లి చేసుకోవడానికి యశోధా నిరకరించింది.

ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా పెళ్లి చేసుకోవడానికి యశోధా అంగీకరించలేదు. చివరికి ప్రేమించిన తిప్పేష్ ను పెళ్లి చేసుకోవాలని యశోధా డిసైడ్ అయ్యింది. కుటుంబ సభ్యుల ఎదిరించిన యశోధా 11 నెలల క్రితం ఆమె ప్రియుడు తిప్పేష్ ను పెళ్లి చేసుకుంది. వివాహం చేసుకున్న తరువాత తిప్పేష్, యశోధా దంపతులు సంతోషంగా కాపురం చేశారు. యశోధా ప్రస్తుతం నాలుగు నెలల గర్బవతి.

రెండు నెలల నుంచి తిప్పేష్, యశోధా దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. అయితే యశోధా భర్త తిప్పేష్ తో రాజీ అయ్యి సర్దుకుపోతా ఉంది. ఆదివారం భర్త తిప్పేష్ తో కలిసి యశోధా బైక్ లో బయలుదేరింది. తిప్పేష్, అతని భార్య యశోధా ఇద్దరూ హెల్మెట్ లు పెట్టుకుని బైక్ లో దావణగెరెకి వెళ్లారు. తరువాత పని ముగించుకుని ఇద్దరూ బైక్ లో సొంత ఊరికి బయలుదేరారు.

The husband killed his love marriage wife by hitting her with a helmet in Karnataka.

దావణగెరెలో బయలుదేరినప్పటి నుంచి తిప్పేష్, యశోధా గొడవపడుతూనే ఉన్నారు. మార్గం మధ్యలో చెన్నగిరి సమీపంలోని నుగ్గిహళ్లి క్రాస్ దగ్గర గొడవ పెద్దది అయ్యింది. ఆ సందర్బంలో బైక్ నిలిపిన తిప్పేష్ అతని భార్య యశోధా హెల్మెట్ లాక్కొని ఆమె తల మీద దారుణంగా దాడి చేసి ఆమెను స్పాట్ లో చంపేశాడు. తరువాత బైక్ లో వేగంగా వస్తున్న సమయంలో బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో యశోధా చనిపోయిందని పోలీసులకు సమాచారం అందించాడు.

యశోధా హత్యకు గురైయ్యిందని ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. తిప్పేష్ కు ఎలాంగి గాయలు కాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసులు తిప్పేష్ ను అదుపులోకి తీసుకుని అతనికి లాఠీ రుచి చూపించారు. ఆ సందర్బంలో తన భార్య యశోధాను తానే హత్య చేశానని అంగీకరించాడు. ప్రాణాలు కాపాడుకోవడానికి తలకు పెట్టుకునే హెల్మెట్ తీసుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్యను ఆమె భర్త హత్య చెయ్యడంతో అందరూ హడలిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+