అర్దరాత్రి కోడలి ప్రైవేట్ పార్ట్స్ మీద యాసిడ్ పోసిన అత్త, భర్త విదేశాల్లో, నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా ?

అర్దరాత్రి ఇంటికి వెళ్లిన అత్త ఆమె కోడలిని చూసి రగిలిపోయి కోపం తట్టుకోలేక యాసిడ్ తీసుకువచ్చి కోడలి ముఖం, శరీరం, ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద పోసేసింది.

చెన్నై/కడలూరు/పుదుచ్చేరి: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో కలిసి సంతోషంగా జీవించింది. పెద్దలు సెట్ చేసిన పెళ్లి కావడంతో దంపతుల ఇంటికి ఇరువైపుల కుటుంబ సభ్యులు వచ్చి వెలుతున్నారు. ఉద్యోగరీత్యా భర్త విదేశాలకు వెళ్లాడు. భార్య ఆమె అత్తమామల ఇంటిలోనే ఉంటున్నది. అత్తమామలు రాత్రి బయటకు వెళ్లారు. అర్దరాత్రి ఇంటికి వెళ్లిన అత్త ఆమె కోడలిని చూసి రగిలిపోయింది. కోపం తట్టుకోలేక ఇంట్లో ఉన్న యాసిడ్ తీసుకువచ్చి కోడలి ముఖం, శరీరం, ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద పోసేసింది.

విదేశాల్లో భర్త

విదేశాల్లో భర్త

తమిళనాడలోని కడలూరు జిల్లాలోని వృధాచలం చెల్లియమ్మన్ కోయిల్ వీధిలో ముఖేష్‌రాజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ముఖేష్ రాజ్ విదేశాల్లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ముఖేష్ రాజ్ కీర్తికా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి జరిగిన తరువాత కొన్ని నెలల పాటు భార్య కీర్తికాతో సంతోషంగా కాపురం చేసిన ముఖేష్ రాజ్ తరువాత ఉద్యోగం చెయ్యడానికి విదేశాలకు వెళ్లిపోయాడు.

అత్తారింటిలో కీర్తీకా

అత్తారింటిలో కీర్తీకా

భర్త ముఖేష్ రాజ్ విదేశాలు వెళ్లడంతో అతని భార్య కీర్తికా ఆమె అత్తమామలతో కలిసి ఉంటున్నది. ముఖేష్ రాజ్ తల్లి ఆండాల్ లకు, కీర్తికాకు రానురాను చిన్నచిన్న గొడవలు మొదలైనాయి. అత్తాకోడులు ఆండాల్, కీర్తికాలకు రానురాను గొడవలు ఎక్కువ అయ్యాయని తెలిసింది. అయితే పుట్టింటికి వెళ్లకుండా కీర్తికా ఆమె అత్త ఆండాల్ ఇంటిలోనే ఉంటున్నది.

అర్దరాత్రి కోడలు ఇంట్లో ?

అర్దరాత్రి కోడలు ఇంట్లో ?

భర్తతో కలిసి బయటకు వెళ్లిన అత్త ఆండాళ్ అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. ఆ సమయంలో కోడలు కీర్తికా సెల్‌ఫోన్‌లో కోడుకు ముఖేష్ రాజ్ తో కాకుండా మరెవరితోనో మాట్లాడుతున్నట్లు సమాచారం. దీంతో కోపోద్రిక్తురాలైన ఆండాళ్ కోడలు కీర్తికాతో గొడవపడింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిపోయిందిని తెలిసింది.

కోడలి ప్రైవేట్ పార్ట్స్ మీద యాసిడ్ పోసిన అత్త

కోడలి ప్రైవేట్ పార్ట్స్ మీద యాసిడ్ పోసిన అత్త

సహనం కోల్పోయిన ఆండాల్ ఇంటిలోని యాసిడ్ తీసుకొచ్చి ఆమె కోడలు కీర్తికా కళ్లు, చెవులతో పాటు ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీద పోసింది. అలాగే కృతికా నోటిలో పురుగుల మందు పోసి ఆమెను హత్య చెయ్యడానికి ప్రయత్నించింది. యాసిడ్ దాడితో మంటలు తట్టుకోలేక కీర్తికా గట్టిగా కేకలు వేసింది. కీర్తికా అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు కీర్తికాను రక్షించి అంబులెన్స్‌లో వృద్ధాచలం ఆస్పత్రికి తరలించారు. అనంతరం తదుపరి చికిత్స నిమిత్తం కడలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

నా కోడలు తిరుగుబోతు అయ్యింది

నా కోడలు తిరుగుబోతు అయ్యింది

యాసిడ్ పోయడంతో కీర్తికా కుడికన్ను పూర్తిగా కోల్పోయిందని పోలీసులు అన్నారు. కీర్తికాను శస్త్రచికిత్స నిమిత్తం పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ కంటి ఆసుపత్రిలో చేర్చారు. ఈలోగా వృద్ధాచలం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన అత్తగారు ఆండాల్ తన కోడలు కీర్తికా తిరుగుబోతు అయ్యిందని, అందుకే ఆమె మీద హత్యాయత్నం చూశానని చెప్పడంతో పోలీసులు హడలిపోయారు. ఆండాల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+