hair style: కొడుకు హెయిర్ స్టైల్ చెడిపోయిందని పోలీసు ఏం చేశాడంటే, పోలీసు పెళ్లామ్ అంటే ?

కొడుకు హెయిర్ కటింగ్ చూసిన తల్లి వెంటనే ఆమె పోలీసు మొగుడికి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పింది. రేచ్చిపోయిన కానీస్టేబుల్ సెలూన్ షాక్ కు తాళం వేసి నానా హంగామా చేశాడు. పోలీసు పెళ్లామ్ సెలూన్ షాప్ దగ్గరకు చేరుకుంది.

చెన్నై/తిరునల్వేలి: కానీస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అతని భార్య, కుమారుడితో కలిసి నివాసం ఉంటున్నాడు. పోలీసు ఉద్యోగం చేస్తున్న వ్యక్తి అతని కుమారుడికి హెయిర్ కటింగ్ చేయించడానికి తీరికలేకుండా పోయింది. కొడుక్కి డబ్బులు ఇచ్చిన పోలీసు మామూలుగా వెళ్లే సెలూన్ కు వెళ్లి హెయిర్ కటింగ్ చేయించుకోవాలని చెప్పాడు. కొడుకు హెయిర్ కటింగ్ చేసుకుని ఇంటికి వెళ్లాడు. కొడుకు హెయిర్ కటింగ్ చూసిన తల్లి వెంటనే ఆమె పోలీసు మొగుడికి ఫోన్ చేసి మ్యాటర్ చెప్పింది. రేచ్చిపోయిన కానీస్టేబుల్ సెలూన్ షాక్ కు తాళం వేసి నానా హంగామా చేశాడు. పోలీసు పెళ్లామ్ సెలూన్ షాప్ దగ్గరకు చేరుకుని ఆ షాప్ యజమానిని అమ్మనా బూతులు తిట్టింది. ఇంతకు ఏం జరిగిందంటే ?

పోలీస్ కొడుకు హెయిర్ కటింగ్

పోలీస్ కొడుకు హెయిర్ కటింగ్

తమిళనాడులోని తిరునల్వేలిలోని వెక్యాన్విలై పోలీస్ స్టేషన్‌లో నవీన్ జాన్ బిట్రో అలియాస్ నవీన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. నిన్న ఆదివారం నవీన్ అతని కొడుకు జుట్టు కత్తిరింపు కోసం ఆ ప్రాంతంలోని ఓ సెలూన్ షాప్‌కి పంపించాడు. తరువాత జుట్టు కత్తిరించుకున్న పోలీసు నవీన్ కొడుకు ఇంటికి తిరిగొచ్చాడు. హెయిర్ కటింగ్ చేసుకున్న కొడుకు ఇంటికి తిరిగి రావడంతో అతని హెయిర్ స్టైల్ చూసిన బాలుడి తల్లి కోపంతో ఆమె పోలీసు భర్తకు ఫోన్‌లో సమాచారం అందించింది.

చిందులు వేసిన కానీస్టేబుల్

చిందులు వేసిన కానీస్టేబుల్

కానీస్టేబుల్ నవీన్ వెంటనే ఇంటికి వెళ్లాడు. కొడుకు జుట్టు కత్తిరించి ఉండడం చూసిన నవీన్ కు ఆవేశం తారాస్థాయికి వెళ్లిపోయింది. వెంటనే కొడుకును పిలుచుకుని రామకృష్ణ స్కూల్ ఎదురుగా ఉన్న సెలూన్ షాపుకి వచ్చాడు. ఆ సమయంలో షాపులో ఎవరూ లేరని గుర్తించిన కానీస్టేబుల్ నవీన్ అక్కడ చిందులు వేశాడు. సెలూన్ షాపు యజమాని శివరామన్ భోజనం చేసేందుకు వెళ్లాడు. సెలూన్ షాప్ యజమాని శివరమాన్ కు ఫోన్ చేసిన కానీస్టేబుల్ నవీన్ అతన్ని అనుచిత పదజాలంతో దుర్భాషలాడుతూ బూతులు తిట్టాడు.

హడిలిపోయిన సెలూన్ షాప్ ఓనర్

హడిలిపోయిన సెలూన్ షాప్ ఓనర్

పోలీసు ఫోన్ చేసి బూతులు తిట్టడంతో మడలిపోయిన సెలూన్ షాప్ యజమాని శివరామన్ నేను వెంటనే వస్తున్నానని చెప్పిన సెలూన్ దుకాణం దగ్గరకు నిమిషాల్లో వెళ్లాడు. అయితే అప్పటికి సెలూన్ షాపు తాళం వేసేందుకు కానీస్టేబుల్ నవీన్ ప్రయత్నించాడు. పక్కనే ఉన్నవారు పోలీసు నవీన్ ను అడ్డుకున్నారు. పోలీసు నవీన్ తీరును, అతను చేస్తున్న హంగామాను చుట్టుపక్కల వారు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.

పోలీసు పెళ్లామ్ అనిపించుకుంది

పోలీసు పెళ్లామ్ అనిపించుకుంది

ఇంతలో పోలీసు నవీన్ భార్య అక్కడికి చేరుకుని సెలూన్ షాప్ ఓనర్ శివరామన్ ను అమ్మనాబూతులు తిట్టింది. పోలీసు దంపతులు అనుచిత పదాలతో దూషించడంతో సెలూన్ షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో ఆ బాలుడు తన స్నేహితులతో కలిసి వేరే దుకాణానికి వెళ్లి తన ఇష్టానుసారం జుట్టును కత్తిరించుకున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు మందలిస్తారనే కారణంతో మాట మార్చినట్లు బాలుడు వెల్లడించాడు. పోలీసు అనే ధైర్యంతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సెలూన్ షాప్ ఓనర్ ను అమ్మనాబూతులు తిట్టిన పోలీసు ననవీన్ ను వెంటనే వీర్ కు ట్రాన్సఫర్ చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+