వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రజల ప్రాణాల కోసం పోరాడటమే తన నేరం : ఆక్సిజన్ ఆడిట్ నివేదికపై సీఎం అరవింద్ కేజ్రీవాల్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆక్సిజన్ ఆడిట్ కమిటీ నివేదిక ఇచ్చిందంటూ, ఢిల్లీ ప్రభుత్వం అవసరానికంటే నాలుగు రెట్లు అదనంగా ఆక్సిజన్ కోరిందని పేర్కొన్న వివాదాస్పద నివేదికను తిప్పికొట్టారు. కరోనావైరస్ సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న సమయంలో తమ ప్రభుత్వం ఆక్సిజన్ అవసరాన్ని నాలుగింతలు పెంచి చెప్పిందని పేర్కొనడం తప్పని ఆయన అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని 2 కోట్ల ప్రజల ప్రాణాల కోసం తాను పోరాడటం తన నేరం అని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

చిక్కుల్లో ఢిల్లీ సర్కార్: అవసరం కంటే 4 రెట్లు అదనంగా, ఆక్సిజన్ వాడకంపై ఆడిట్ లో షాకింగ్ విషయాలుచిక్కుల్లో ఢిల్లీ సర్కార్: అవసరం కంటే 4 రెట్లు అదనంగా, ఆక్సిజన్ వాడకంపై ఆడిట్ లో షాకింగ్ విషయాలు

కరోనా మహమ్మారి రెండవ వేవ్ విజృంభిస్తున్న సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్ర ఇబ్బంది పెడితే,కేంద్రం సహాయం చేయడంలో తాత్సారం చేసిందని, అనేక పోరాటాల తరువాత ఆక్సిజన్ కోటాను పెంచిందని పేర్కొన్న అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ ఎలాంటి రిపోర్టులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఇది కేవలం తప్పుడు ప్రచారంలో భాగమని ఆయన మండిపడ్డారు. అయితే తాజా నివేదిక సుప్రీంకోర్టు ఆడిట్ బృందం యొక్క తాత్కాలిక నివేదిక అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

 This is my crime .. Arvind Kejriwal On Report On Exaggerated Oxygen Need

ఢిల్లీని పరిపాలించే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్),అటువంటి నివేదిక లేదని మరియు ఈ వాదన హానికరమైన వాదన అని,బిజెపి సర్కార్ ఆమ్ ఆద్మీ పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్న ప్రచారంలో భాగంగా ఉంటూ మండిపడుతున్నారు. ఇప్పటికి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కేంద్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు.ఈ నివేదిక బిజెపి కార్యాలయంలో కార్యాలయంలో కూర్చుని తయారు చేసిన నివేదిక అని అసహనం వ్యక్తం చేశారు.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal on Friday hit back at a contentious report that claimed his government had "exaggerated oxygen need" at the peak of the second wave of the coronavirus. "My crime is I fought for the lives of Delhi's 2 crore people," the Chief Minister said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X