టిక్ టాక్ నిషేధంపై స్పందించిన టిక్ టాక్ ఇండియా ... డేటా గోప్యతపై ఏమన్నదంటే
జాతీయ భద్రత మరియు గోప్యతా సమస్యలపై 58 చైనా మొబైల్ యాప్‌లతో పాటు సోమవారం బ్లాక్ చేసిన తర్వాత స్పష్టత ఇవ్వమని ప్రభుత్వం ఆహ్వానించినట్లు టిక్‌టాక్ ఇండియా తెలిపింది. జనాదరణ పొందిన వీడియో షేరింగ్ యాప్ అయిన టిక్ టాక్ ప్రభుత్వ ఉత్తర్వులను పాటించే ప్రక్రియలో ఉందని మరియు భారత చట్టం ప్రకారం డేటా గోప్యత మరియు భద్రతా అవసరాలకు అనుగుణంగానే పని చేస్తోంది అని తెలిపింది టిక్ టాక్ ఇండియా.

భారతదేశ రక్షణ, భద్రత కోసం 59 చైనీస్ యాప్స్ బ్లాక్
లడఖ్‌లో జూన్ 15 న జరిగిన ఘర్షణ తరువాత భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని తాజాగా చైనా యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వ చర్య నొక్కిచెప్పింది.భారతదేశం యొక్క సార్వభౌమత్వం మరియు సమగ్రత, భారతదేశం యొక్క రక్షణ,భద్రతకోసం బ్లాక్ చేయబడిన 59 చైనీస్ యాప్స్ లో టిక్‌టాక్, యుసి బ్రౌజర్ మరియు వీచాట్ ఉన్నాయి. ఈ యాప్స్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ నుండి తొలగించబడ్డాయి.

ఆ యాప్స్ నిర్వాహకులకు తమ వాదన వినిపించే అవకాశం ఇచ్చిన సర్కార్
ఈ యాప్స్ కు యాక్సెస్ మరియు డేటాను నిరోధించాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ప్రభుత్వం కోరింది. ఈ నిషేధం మధ్యంతరమని ప్రభుత్వం చెబుతోంది. నిషేధించబడిన యాప్స్ కు వివిధ మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్న కమిటీ ముందు ప్రభుత్వ నిర్ణయానికి స్పందించే అవకాశం ఇవ్వబడుతుంది. వారు తమ వాదన వినిపించాక కమిటీ అప్పుడు నిషేధాన్ని తొలగించాలా లేదా కొనసాగించాలా అని సిఫారసు చేస్తుంది.

చైనాతో సహా ఏ దేశంతోనూ ఇండియన్స్ సమాచారం పంచుకోలేదన్న టిక్ టాక్
టిక్ టాక్ ఇండియా తన ప్రకటనలో, చైనా ప్రభుత్వంతో సహా ఏ విదేశీ ప్రభుత్వంతోనూ భారతదేశంలోని వినియోగదారుల సమాచారాన్ని పంచుకోలేదని తెలిపింది.
వైరల్ యాప్ అయిన టిక్ టాక్ ద్వారా తాము భవిష్యత్తులో కూడా అలా సమాచారాన్ని ఇతరులకు ఇవ్వబోమని తేల్చింది. తాము వినియోగదారు గోప్యత మరియు సమగ్రతకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చామని పేర్కొంది. స్పందించి, వివరణ ఇవ్వటం కోసం ప్రభుత్వం తమను ఆహ్వానించిందని టిక్ టాక్ ఇండియా అధినేత నిఖిల్ గాంధీ అన్నారు.
Recommended Video

యూజర్ డేటా దొంగతనం, గోప్యతపై టిక్ టాక్ క్లారిటీ
టిక్‌టాక్ 14 భారతీయ భాషలలో ఇంటర్నెట్‌లో తన సేవలను అందుబాటులోకి తెచ్చి ప్రజలకు చేరువైంది.వందలాది మిలియన్ల మంది వినియోగదారులు, కళాకారులు, కథ చెప్పేవారు, విద్యావేత్తలు మరియు ప్రదర్శకులు వారి జీవనోపాధి కోసం, తమను తాము ప్రమోట్ చేసుకోవటం కోసం దీనిని ఉపయోగిస్తున్నారు అని గాంధీ అన్నారు .
యూజర్ డేటా దొంగతనం, యూజర్ గోప్యతను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్న కారణంగానే టిక్ టాక్ బ్యాన్ చేసినట్టు పేర్కొంది ప్రభుత్వం. ఈ యాప్స్ తమ సర్వర్లు సింగపూర్‌లో ఉన్నందున సహజంగానే అనుమానం ఉంటుంది. ఈ సమయంలో వారు వినియోగదారు డేటాను చైనాకు పంపరు అని టిక్ టాక్ ఇండియా చేస్తున్న వాదనలకు హోం మంత్రిత్వ శాఖ అంగీకరించే అవకాశం లేదు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications