వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేటా వెబ్ సైట్ లో మొత్తం అర్దనగ్న చిత్రాలే ! బ్యాన్ చెయ్యండి

జంతు రక్షణ అంటూ బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు అర్దనగ్నంగా ఉన్న ఫోటోలు తీయించి తన వెబ్ సైట్ లో పెడుతున్న పేటా సంస్థను భారత్ లో నిషేధించాలని తమిళనాడు బాలల హక్కుల సంస్థ నాయకులు డిమాండ్ చేశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో సాంప్రధాయ క్రీడ జల్లికట్టును పదేపదే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న పేటా సంస్థను నిషేధించాలని తమిళనాడు బాలల హక్కుల రక్షణా సంస్థ ఆందోళనకు దిగింది. శుక్రవారం వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి పేటా సంస్థను వెంటనే భారత్ లో నిషేధించాలని నినాదాలు చేశారు.

జంతు రక్షణ సంస్థ అని చెప్పుకుంటూ బయటకు పోరాటం చేస్తున్న పేటా సంస్థ వెబ్ సైట్ లో అన్నీ అర్దనగ్న చిత్రాలే ఉన్నాయని ఆరోపించారు. ఇలాంటి చెత్త సంస్థను నిషేధించాలని బాలల హక్కుల సంస్థ నాయకులు డింమాడ్ చేశారు.

TN’s child rights panel has recommended banning PETA’s website for allegedly showing sexually explicit content.

జంతు రక్షణ కోసం పోరాటం చేస్తున్న పేటా సంస్థ తన వెబ్ సైట్ లో సెలబ్రిటీలు అర్దనగ్నంగా ఉన్న ఫోటోలు ఎందుకు పెట్టారు అని వారు ప్రశ్నించారు. పేటా సంస్థ భారతదేశం నియమాలు గాలికి వదిలేసి అన్ని అర్డనగ్న చిత్రాలను తన వెబ్ సైట్ లో నింపేసిందని బాలల హక్కుల సంస్థ కార్యదర్శి ఇనోచ్ మోసెస్ మండిపడ్డారు.

పేటా సంస్థ తన వెబ్ సైట్ లో అర్దగ్న చిత్రాలు పెట్టిందని, దీని ప్రభావం పిల్లల మీద పడి వారు పెడదోవపడుతున్నారని ఆరోపించారు. జంతు రక్షణ అంటూ బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రిటీలు అర్దనగ్నంగా ఉన్న ఫోటోలు తీయించి తన వెబ్ సైట్ లో పెడుతున్న పేటా సంస్థను భారత్ లో నిషేధించాలని తమిళనాడు బాలల హక్కుల సంస్థ నాయకులు డిమాండ్ చేశారు.

English summary
Tamil Nadu’s child rights panel has recommended banning PETA’s website for allegedly showing sexually explicit content. People for Ethical Treatment of Animals (PETA) had campaigned for a controversial ban on Jallikattu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X