నేడే కేంద్ర క్యాబినెట్ భేటీ ... కీలక నిర్ణయాలు .. ఈ మూడు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన

Recommended Video

    Lok Sabha Elections 2019: CEC Might Announce The Schedule On 8th March | oneidia Telugu

    ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ చివరి కేబినెట్ భేటీ నేడు కాబోతుంది. ఈ భేటీ తర్వాత ఎన్నికల కురుక్షేత్రంలో నువ్వా నేనా అన్నట్టు తలపడనున్నాయి ప్రధాన పార్టీలు. ఈ నేపథ్యంలో జరగనున్న చివరి భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కేబినెట్ భేటీలో చాలా కీలక నిర్ణయాలు ఉంటాయని, భారీ వరాలను ప్రకటించే అవకాశం ఉంటుందని అందరూ భావిస్తున్నారు.కేబినెట్‌ సమావేశం అనంతరం ఏ క్షణమైనా ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది.

    మోడీ నేతృత్వంలో చివరి క్యాబినెట్ భేటీ .. పలు కీలక నిర్ణయాలు

    మోడీ నేతృత్వంలో చివరి క్యాబినెట్ భేటీ .. పలు కీలక నిర్ణయాలు

    కేబినెట్‌ సమావేశం అనంతరం ఏ క్షణమైనా ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రధాని మోదీ శనివారం యూపీ, బీహార్లలో పలు శంకుస్థాపన లో పాల్గొంటారని తెలుస్తుంది. ఇక ఈ సందర్భంగా కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలను ప్రకటన చేస్తారని కూడా ప్రచారం అవుతోంది.

    అయితే ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ ఇస్తే ప్రధాని నరేంద్ర మోడీ ఈ శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొనే వీలుండదు. మరి అప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించకుండా ఆగుతుందా అన్నది తెలియాల్సి ఉంది.

    శుక్రవారం షెడ్యూల్ ప్రకటిస్తుందా.. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఇప్పుడు లేనట్టేనా..

    శుక్రవారం షెడ్యూల్ ప్రకటిస్తుందా.. జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఇప్పుడు లేనట్టేనా..

    ప్రతీ శుక్రవారం ఎన్నికల సంఘం సమావేశమై ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడం సంప్రదాయం. ఆ సంప్రదాయం ప్రకారం శుక్రవారం త్రిసభ్య ఎన్నికల సంఘం సమావేశమై లోక్‌సభతో పాటు ఏపీ, జమ్మూ కశ్మీర్‌, ఒరిస్సా, మరో రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తేదీలపై నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ ఎన్నికలు ఎప్పుడు ఉండకపోవచ్చు అన్న భావన కూడా వ్యక్తమవుతోంది. అయితే, శుక్రవారమే షెడ్యూల్‌ ప్రకటన ఉంటుందా? శని, ఆదివారాల వరకు వేచిచూడాల్సి వస్తుందా? అనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు.

    శని వారం మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలు .. షెడ్యూల్ ఆలస్యం అవుతుందా ?

    శని వారం మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలు .. షెడ్యూల్ ఆలస్యం అవుతుందా ?

    శనివారం ప్రధాని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పటిదాకా ఎన్నికల సంఘం ఆగుతుందా? అనేది చూడాల్సి ఉంది. ప్రధాని కోసం ఈసీ ఆగితే షెడ్యూల్‌ ప్రకటన ఆదివారం వెలువడే అవకాశం ఉంది. 2014లో మార్చి 5న షెడ్యూల్‌ ప్రకటన వెలువడగా, 25 రోజుల తర్వాత తొలి దశ పోలింగ్‌ ఏప్రిల్‌ 7న జరిగింది. ఇప్పటికే ఎన్నికల తేదీల ప్రకటన ఆలస్యం అయినందున పదో తేదీన ప్రకటన వెలువడితే తొలిదశ పోలింగ్‌కు 25 రోజుల వ్యవధి ఇవ్వకపోవచ్చని భావిస్తున్నారు. గత ఎన్నికల్లా ఈసారి తొమ్మిది దశల పోలింగ్‌ జరిగేదీ అనుమానమేనని అంటున్నారు. ఈసారి ఎండలు విపరీతంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో త్వరితగతిన షెడ్యూల్ రిలీజ్ చేసి ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+