Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్న టామాటా రైతులు, రేయ్ మామా నేను రా అంటూ !

మదనపల్లి/చిత్తూరు/కోలారు: దేశంలో ఇప్పుడు బంగారం ధరల టాపిక్ తరువాత ఎక్కువగా ఉన్న హాట్ టాపిక్ టమాటాలు. టామాటాల ధరలు ఎప్పుదు తగ్గుతాయా ? అంటూ సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు. కొంపలోకి వెళితే టమాటాలు తెచ్చారా అంటూ భార్యలు అడుగుతున్నారని, ఇంటికి వెళ్లాలంటే చిరాకుగా ఉందని చాలా మంది మగాళ్లు విచారం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో టమాటాలు పండిస్తున్న రైతులు వాళ్ల మొబైల్ ఫోన్ లు స్విచ్ ఆఫ్ లు చెయ్యడం, కొందరు బంధువులు, స్నేహితులు ఫోన్ లు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం మొదలుపెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. టమాటాల రైతులకు ఇప్పుడు పంటపండింది. ఇంతకాలం నష్టాల్లో మునిగిపోయిన టమాటాల రైతులు ఇప్పుడు లక్షల్లో డబ్బులు సంపాధిస్తున్నారు.

tomatoformers

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా (గతంలో చిత్తూరు జిల్లా)లోని మదనపల్లి, అంగళ్లు, తంబళ్లపల్లితో పాటు చిత్తూరు జిల్లాలోని పలమనేరుతో పాటు పుంగనూరు, పీలేరు, పాకాల, ఐరాల, బంగారుపాళ్యం, కర్ణాటకలోని చిక్కబళ్లాపురం, కోలారు జిల్లాలతో పాటు తదితర ప్రాంతాల్లో టమాటా పంటలు పెట్టిన రైతులు లక్షల్లో డబ్బులు సంపాధిస్తుంటే ఎకరాలు ఎకరాలు టమాటా పంటలు వేసిన రైతులు నెలలోనే కోటీశ్వరులు అయిపోయారు.

ఇప్పుడు టమాటాలు పండించిన రైతులకు పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇంతకాలం ఎప్పుడు ఫోన్లు చేసి ఎలా ఉన్నారు అని పలకరించని బంధువులు, స్నేహితులు సైతం ఇప్పుడు టామాటా పంటలు వేసిన రైతులకు పదేపదే ఫోన్లు చెయ్యడం మొదలు పెట్టారు. అన్నయ్య, బావా, మామా, తమ్ముడు, ఓరేయ్ అంటూ ఇలా వరసలు కలుపుతూ టమాటా రైతులకు వారి బంధువులు, స్నేహితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి.

tomatos

రేయ్ మీ పొలంలోని కొన్ని టమాటాలు మా ఇంటికి పంపించిరా అంటూ టమాటా రైతులకు ఫోన్లు వెలుతున్నాయి. మార్కెట్ లో కిలో వంద రూపాయలకు పగా ధర పలుకుతున్న టమాటాలు రోజు 20 నుంచి 30 కేజీలు బంధువులు, స్నేహితులు అడుగుతుండటంతో టామాటా పంటలు వేసిన రైతేలకు చిర్తెత్తిపోతోంది. పొలంలో టమాటాలు కొసిన తరువాత ట్రాక్టర్లు, క్యాంటర్, ఏస్ వాహనాల్లో టామాటా మార్కెట్లకు రైతులు టామాటాలు సరఫరా చేస్తున్నారు.

టమాటాలు మార్కెట్ కు పంపించే సమయంలో, వాహనాలు పిలిపించే సమయంలో, మార్కెట్ లో టామాటల ధర ఎంతరేటు పలుకుతోంది అని తెలుసుకునే సమయంలో మాత్రమే మొబైల్ ఫోన్లు ఆన్ చేస్తున్న చాలా మంది రైతులు మిగిలిన సమయంలో ఉచితంగా టామాటాలు సరఫరా చెయ్యలేక వారి మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. మొత్తం మీద టమాటాల దెబ్బతో రైతులు వారి మొబైల్ ఫోన్లు ఆన్ చెయ్యలేక, యూట్యూబ్ లు చూడలేకపోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+