Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండియాలో అతిపెద్ద ఎయిర్ పోర్ట్స్ ఇవేనా..!

ఓ వైపు విమాన ప్రమాదాలు.. మరోవైపు ఇండిగో సంక్షోభం లాంటి వ్యవహారాలతో నిత్యం విమానయాన రంగం గురించి వార్తలు వస్తూనే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా ఈ చలి కాలంలో పొంగ మంచు కారణంగా విమానాల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ఎన్నో ఫ్లైట్స్ టేక్ ఆఫ్, ల్యాండింగ్ ఇష్యూలను ఎదుర్కొంటున్నాయి. వీటన్నింటి కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ సోషల్ మీడియా వేదికగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు సైతం ఈ కారణాల వల్ల అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఇప్పుడు విమాన ప్రయాణాలు, విమానయాన సంస్థలు.. దేశంలోని అతిపెద్ద విమానాశ్రయాలు సహా పలు అంశాల గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. దాంతో దేశంలోని టాప్ 5 అతిపెద్ద విమానాశ్రయాలు ఏవి ? అంటూ జోరుగా చర్చ నడుస్తోంది. అయితే ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే అయినా.. కొంతమంది తెలియని వారికి మాత్రం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అదే దేశంలోనే అతిపెద్ద విమానాశ్రయం ఎక్కడ అని.. ఇంతకీ అది ఎక్కడో కాదు.. మన తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లోనే ఉంది. భాగ్యనగరం లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తీర్ణంలో దేశంలోనే అతి పెద్దది కావడం గమనార్హం. అలానే దేశంలోనే అతిపెద్ద టాప్ 5 విమానాశ్రయాలు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..

top-5-largest-airports-in-india-details

టాప్ 5 అతిపెద్ద విమానాశ్రయాలు ఇవే..?

1. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ( శంషాబాద్ ఎయిర్‌పోర్ట్)

హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఉన్న విమానాశ్రయం దేశంలోనే అత్యంత విశాలమైనది. పేరుకి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అయినప్పటికీ.. వాడుకలో మాత్రం ఎక్కువగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌గానే పిలుస్తుంటారు. నగరంలో అంతకు ముందు బేగంపేట విమానాశ్రయం ఉన్నప్పటికీ.. సిటీ మధ్యలో ఉండడంతో విస్తరణకు అవకాశాలు లేకుండా పోయాయి. దాంతో హైదరాబాద్ శివారులోన దీన్ని నిర్మించారు. అంతే కాకుండా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) నమూనాతో నిర్మించిన మొట్టమొదటి విమానాశ్రయం ఇదే కావడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ జీఎంఆర్, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయగా.. సుమారు 5,500 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది.

2. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్)

దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తీర్ణం పరంగా రెండో స్థానంలో ఉంది. కానీ రద్దీ పరంగా మాత్రం అగ్రస్థానంలో నిలుస్తుంది. దేశ పరిపాలనా కేంద్రం ఇక్కడే ఉండటంతో.. నిత్యం దేశవిదేశాల నాయకులు, వ్యాపారులు, పర్యాటకులు ఈ విమానాశ్రయం ద్వారానే రాకపోకలు సాగిస్తుంటారు. అధికారిక లెక్కల ప్రకారం, ఏటా మూడు కోట్ల మందికి పైగా ప్రయాణికులు ఇక్కడి నుండి పయనిస్తారు. 5,106 ఎకరాల విస్తీర్ణంలో నెలకొన్న ఈ విమానాశ్రయానికి రద్దీ పెరగడంతో.. ఢిల్లీ శివారులోని నోయిడాలో మరో భారీ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు.

3. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (బెంగళూరు ఎయిర్‌పోర్ట్)

బెంగళూరు లోని కెంపేగౌడ పేరు మీద ఈ విమానాశ్రయాన్ని నెలకొల్పారు. బెంగళూరు శివారులోని దేవనహళ్లి ప్రాంతంలో ఉన్న ఇది 4,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. విస్తీర్ణం పరంగా మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. ప్రయాణికుల రద్దీ విషయంలో దేశంలో రెండో అతిపెద్ద విమానాశ్రయంగా ఉంది. సౌరశక్తితో నడిచే మొట్టమొదటి విమానాశ్రయం ఇదే కావడం విశేషం.

4. మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయం, మోపా (గోవా ఎయిర్‌పోర్ట్)

భారత మాజీ రక్షణ మంత్రి, గోవా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గౌరవార్థం ఈ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టారు. 2,132 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇది గోవాలోని రెండో అంతర్జాతీయ విమానాశ్రయం. 2023లో ప్రారంభమైన ఈ విమానాశ్రయాన్ని, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించిన జీఎంఆర్ సంస్థే అభివృద్ధి చేసింది. జీఎంఆర్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GGIAL) దీని నిర్వహణా బాధ్యతలను చూసుకుంటోంది.

5. దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయం (గోవా ఎయిర్‌పోర్ట్)

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1955లో గోవాలో ఈ దబోలిమ్ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. ఇది 1,700 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా.. ఏటా వేలాది మంది దేశీయ, విదేశీ పర్యాటకులు గోవాను సందర్శిస్తుంటారు. పాత దబోలిమ్ ఎయిర్‌పోర్ట్ స్థానంలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన మనోహర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+