
ప్రోటోకాల్ పాటించడం లేదు.. ఆ పార్టీకి వీఆర్ఎస్సే: బండి సంజయ్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే క్రమంలో ఆ పార్టీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. బీజేపీతో టీఆర్ఎస్ పార్టీకి పోలిక ఏంటీ అని అడిగారు. తమకు గులాబీ దండు పోటీ కాదని స్పష్టం చేశారు. బీజేపీకి అత్యధిక కార్యకర్తలు ఉన్నారని తెలియజేశారు. తమది జాతీయ పార్టీ అని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.

వీఆర్ఎస్ తప్పదు
తెలంగాణ
ప్రభుత్వంపై
బండి
సంజయ్
మండిపడ్డారు.
టీఆర్ఎస్‌కు
ఇక
వీఆర్ఎస్
తప్పదని
తేల్చిచెప్పారు.
బీజేపీతో
టీఆర్ఎస్‌కు
పోటీ
ఎంటీ
అని
ప్రశ్నించారు.
టీఆర్ఎస్
తమకు
గోటితో
సమానం
అని
హాట్
కామెంట్స్
చేశారు.
బీజేపీ
దేశంలో
అతి
పెద్ద
పార్టీ
అని,
ప్రపంచంలో
అత్యధికంగా
కార్యకర్తలు
ఉన్నారని
గుర్తుచేశారు.
తమతో
పోల్చుకుంటే
టీఆర్ఎస్
పార్టీ
ఎక్కడ
అని
కామెంట్
చేశారు.

నో ప్రోటోకాల్
జాతీయ
కార్యవర్గ
సమావేశాలు
రేపటినుంచి
నోవాటెల్
హోటల్‌లో
జరగనున్నాయి.
టీఆర్ఎస్
ప్రభుత్వం
కనీసం
ప్రొటోకాల్
పాటించడం
లేదని
బండి
సంజయ్
విమర్శలు
చేశారు.
తమ
పార్టీ
జాతీయ
కార్యవర్గ
సమావేశాలకు
చాలామంది
ప్రముఖులు
వస్తున్నారని
తెలిపారు.
కనీసం
ప్రోటోకాల్
ఇవ్వడం
లేదని
మండిపడ్డారు.
ఇదీ
మంచి
పద్ధతి
కాదని
హితవు
పలికారు.
జాతీయ
నేతలు,
కేంద్ర
మంత్రులు
వస్తే..
ప్రోటోకాల్
పాటించడం
కనీస
ధర్మం
అని
వివరించారు.

దిగజార్చి..
రాష్ట్రపతి
ఎన్నికలను
కేసీఆర్
గల్లి
స్థాయికి
దిగ
జార్చారని
విమర్శలు
చేశారు.
సపోర్ట్
ఇవ్వొచ్చు..
కానీ
దాని
కోసం
రాజకీయాలు
చేయడం
సబబు
కాదని
కామెంట్
చేశారు.
అలాగే
సిటీలో
ప్లెక్సీల
రగడ
నెలకొన్న
సంగతి
తెలిసిందే.
దీనిపై
బండి
సంజయ్
స్పందించారు.
బీజేపీ
ఫ్లెక్సీ
లను
అడ్డుకొగలరేమోగానీ
తమను
అడ్డుకోలేరని
చెప్పారు.

మాటల యుద్దం
గత
కొంతకాలంగా
బీజేపీ
వర్సెస్
టీఆర్ఎస్
పార్టీ
మధ్య
మాటల
యుద్దం
జరుగుతుంది.
ఇరు
పార్టీ
నేతల
మధ్య
విమర్శలు
కంటిన్యూ
అవుతున్నాయి.
రాష్ట్రపతి
ఎన్నిక..
అంతలోనే
జాతీయ
కార్యవర్గ
సమావేశాల
నేపథ్యంలో
డైలాగ్
వార్
కొనసాగుతోంది.