ఆర్కె నగర్‌లో గెలుపు: సుబ్రహ్మణ్య స్వామి అంచనా ఇదీ

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ప్రతిష్టాత్మకమైన ఆర్కె నగర్ ఉప ఎన్నికలో టీటీవి దినకర్ గెలుస్తారని బిజెపి నేత, పార్లమెంటు సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ వ్యాఖ్య పోస్టు చేశారు.

దినకరన్‌కు 37 శాతం ఓట్లు వస్తాయని కూడా ఆయన అంచనా వేశారు. ఇది మంచి వార్త అని కూడా అన్నారు. టిటీవీ దినకరన్ గెలుస్తారనే విషయాన్ని ఆయన బుధవారంనాడే చెప్పారు. అయితే, గురువారం ట్విట్టర్‌లో కూడా అదే విషయం చెప్పారు.

టీటీవీ దినకరన్‌పై స్వామి ఇలా...

టీటీవీ దినకరన్‌పై స్వామి ఇలా...

టిటీవీ దినకరన్ అన్నాడియంకె నేత ఇ. మధుసూదనన్‌ను, డిఎంకె అభ్యర్థి ెన్ మరుదు గణేష్‌లను ఓడిస్తారని సుబ్రహ్మణ్య స్వామి న్యూస్ 18 చానెల్‌తో బుధవారంనాడు చెప్పారు. పాలక అన్నాడియంకె రేసులో కూడా ఉండదని అన్నారు.

 వారిద్దరి మధ్యే పోటీ..

వారిద్దరి మధ్యే పోటీ..

ఆర్కె నగర్‌లో పోటీ డిఎంకె అభ్యర్తికి, దినకరన్‌కు మధ్యనే ఉంటుందని తాను భావిస్తున్నట్లు సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. ఈపిఎస్ - ఓపిఎస్ వర్గానికి చెందిన అన్నాడియంకె రేసులో కూడా ఉండదని అన్నారు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలను ఆయన వెన్నెముక లేనివారిగా అభివర్ణించారు. వారు డిఎంకెను ముందుకు నడిపించలేరని అన్నారు.

దినకరన్ మాత్రమే రక్షించగలడు...

దినకరన్ మాత్రమే రక్షించగలడు...

కార్యకర్తలు ఎక్కువ మంది ఇప్పటికీ దినకరన్ వైపే ఉన్నారని తాను భావిస్తున్నట్లు సుబ్రహ్మణ్యయ స్వామి చెప్పారు. డిఎంకెకు దినకరన్ సవాల్ కాబోతున్నట్లు చెప్పారు. దినకరన్ మాత్రమే తమిళులను రక్షించగలరని కూడా అన్నారు.

 డిఎంకె హిట్లర్ పార్టీ...

డిఎంకె హిట్లర్ పార్టీ...

డిఎంకెను సుబ్రహ్మణ్య స్వామి హిట్లర్ పార్టీగా అభివర్ణించారు. అవినీతి, నేర కార్యకలాపాలతో తమిళ ప్రజలను డిఎంకె మోసం చేసిందని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఆర్కె నగర్ ఉప ఎన్నిక పోలింగ్ గురువారంనాడు ముగిసింది. ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరుగుతుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP leader and MP Dr Subramanian Swamy on Wednesday predicted that TTV Dinakaran might win the prestigious RK Nagar byelection.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి