Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణరంగంలో అమీతుమీ తేల్చుకోవాలని బరిలోకి తిగిన టీవీకే పార్టీ (TVK) అధినేత విజయ్ (vijay)కు ఏదీ కలిసి రావడం లేదు. ముఖ్యంగా భారీ అంచనాలు పెట్టుకున్న యువత పూర్తి స్దాయిలో తనవైపుకు మళ్లడం లేదని తాజా సర్వేలు తేల్చేశాయి. మిగతా వర్గాలను ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా అంతగా ఫలించడం లేదు. దీంతో తాజాగా మరోసారి విజయ్ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

ఇప్పటివరకూ డీఎంకే-అన్నాడీఎంకే కూటములకు గట్టి పోటీనివ్వడం ద్వారా తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యామ్నాయశక్తిగా అవతరించాలని భావించిన విజయ్..తాజా సర్వేలతో ఇప్పుడు రూటు మార్చారు. ఇప్పటివరకూ డీఎంకే, అన్నాడీఎంకే అభ్యర్ధులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలను టార్గెట్ చేసిన విజయ్.. తాజా సర్వేల తర్వాత ఇప్పుడు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పోటీ చేస్తున్న సీట్లపై ఫోకస్ పెట్టారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కంటే స్థానిక పార్టీ అయిన టీవీకే అభ్యర్ధికే ఓటు వేస్తే ప్రయోజనం ఉంటుందనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి దశలో విజయ్ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. తర్వాత కారైకుడి, కన్యాకుమారి జిల్లాల్లో రోడ్ షోలు, ప్రచారాన్ని కొనసాగించారు.

TVK Chief Vijay s Final Campaign Strategy Why He s Targeting Seats Contested by National Parties

తర్వాత తిరుప్పూర్, ధర్మపురి జిల్లాల్లో ప్రచారం, రోడ్ షోలకు అనుమతులు పొందారు. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్, బీజేపీ, పీఎంకే వంటి పార్టీలకు గణనీయమైన పట్టు ఉంది. విజయ్ ఎంట్రీ వల్ల కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలు పోటీచేసే స్థానాల్లో ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదేవిధంగా యువ ఓటర్లను, 'మార్పు’ కోరుకునే వర్గాలను విజయ్ ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి ప్రధాన ద్రావిడ పార్టీలకు బలమైన స్థానాలను కాకుండా, కుల ఆధారిత, జాతీయ పార్టీలు పోటీచేసే నియోజకవర్గాలపైనే విజయ్ ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. విజయ్ ప్రచార ప్రణాళిక కేవలం యాదృచ్ఛికం కాదని, ఇది ఒక పక్కా రాజకీయ అంచనా అని విశ్లేషకులు భావిస్తున్నారు.

TVK Chief Vijay s Final Campaign Strategy Why He s Targeting Seats Contested by National Parties

ద్రావిడ పార్టీల ఆధిపత్యం లేని లేదా జాతీయ పార్టీలు ప్రభావం చూపగల స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా అసెంబ్లీలో బలమైన ముద్ర వేయవచ్చని విజయ్ విశ్వసిస్తున్నారు. అందుకే గెలుపు అవకాశాలున్న నియోజకవర్గాలపై ఆయన తన ప్రచారాన్ని కేంద్రీకరించినట్లు కనిపిస్తోంది. చెన్నై, మధురై, కోయంబత్తూర్ వంటి ప్రధాన నగరాలకు బదులుగా, మైనారిటీలు, మత్స్యకారులు అధికంగా ఉన్న, జాతీయ పార్టీలు ఆధిపత్యం చెలాయించే నియోజకవర్గాలపై విజయ్ తన ప్రచారం సాగిస్తున్నారు. ఈ వ్యూహం ద్వారా కనీసం రెండో స్థానాన్ని అయినా దక్కించుకోవచ్చని విజయ్ నమ్ముతున్నట్లు సినీ, రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+