• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కిలాడీ లేడీలు: అరెస్టు తప్పించుకునేందుకు బట్టలు విప్పారు

|

ముంబైలో పోలీసుల అరెస్టు నుంచి తప్పించుకునేందుకు అక్కా చెల్లెళ్లు నడిరోడ్డుపై బట్టలు విప్పుకున్న ఘటన కలకలం సృష్టించింది. ముంబైలో నివాసముంటున్న సరిత, సుజాత అనే ఇద్దరు మహిళలు వరుసకు అక్కా చెల్లెళ్లు. వీరి పని దొంగతనం చేయడం హ్యాపీగా కాలం గడిపేయడం. ఇప్పటి వరకు ముంబైలో 10 ఇళ్లల్లోకి చొరబడి బంగారు, నగదుతో పాటు విలువైన వస్తువులను చోరీ చేశారు. ఇక చివరిగా బోరివిలి ప్రాంతంలోని కస్తూర్బా మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి నగలను దొంగతనం చేశారు. సీసీ కెమరాలు ఉన్నాయని గుర్తించలేదో ఏమో.... అడ్డంగా బుక్కయ్యారు. ప్రతిరోజూ ఒకేలా ఉంటుందని పొరపాటుపడ్డారు... ఆపై పట్టుబడ్డారు.

ఉద్యోగం పేరుతో పలు ప్రాంతాల్లో సరిత సుజాతలు చక్కర్లు కొడతారు. అదే సమయంలో రెక్కీ నిర్వహిస్తారు. ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకుని ఇంట్లోకి నక్కి దొరికిందంతా దోచేస్తారు. ఇలాంటి దొంగతనం కేసే మాలాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. కస్తూర్బా పోలీస్ స్టేషన్‌కు చెందిన ఓ అధికారి సీసీటీవీ ఫుటేజీల కోసం మలాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చాడు. తిరిగి వెళుతున్న సమయంలో డైమండ్ మార్కెట్ ప్రాంతంలో ఓ మహిళ ఆయనకు కనిపించింది. సీసీటీవీ ఫుటేజీలో ఉన్న మహిళ...ఇప్పుడు అధికారికి తారసపడ్డ మహిళ ఒకేలా ఉండటంతో ముందుగా తన సహోద్యోగులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు స్పాట్‌కు చేరుకున్నారు. దొంగతనానికి పాల్పడింది ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లే అని నిర్ధారణకు వచ్చారు. వెంటనే వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.

Two sisters go half naked to escape arrest

ఇక ఇక్కడే స్టోరీ టర్న్ తీసుకుంది. అరెస్టు చేస్తున్న పోలీసులపై సరిత, సుజాతలు తిరగబడ్డారు. వారు వీరిని లైంగికంగా వేధిస్తున్నారని నానా రచ్చ చేశారు. అంతేకాదు ఇద్దరి అక్కా చెల్లెళ్లలో ఒకరు తన బ్లౌజ్ చించేసుకుని మార్కెట్‌లో బిగ్గరగా అరిచింది. ఈ రభస కాసేపు అక్కడ ఓ చిన్నపాటి సినిమా షూటింగ్‌ను తలపించింది. వెంటనే అక్కడకు మహిళా కానిస్టేబుళ్లు చేరుకుని ఇద్దరి అక్కా చెల్లెళ్లను అదుపులోకి తీసుకున్నారు.

జోగేశ్వరి, కుర్లా ప్రాంతాల్లో ఇద్దరు అక్కా చెల్లెళ్లు నివాసముంటారని పోలీసులు వెల్లడించారు. జూహూ, శాంటాక్రూజ్, వన్రాయ్, ఖర్, ఘట్కోపర్ ప్రాంతాల్లో ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు పోలీసులు వివరించారు. ప్రస్తుతం వారిని అరెస్టు చేసి నాలుగురోజుల పాటు రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు చెప్పారు.

English summary
Two Sisters who doesn't wanted to be arrested for their crimes went half naked by tearing their clothes in diamond market in Mumbai. The sisters identified as Saritha and Sujatha used to loot the houses.But on one fine day they fell into the police bone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X