వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నితీశ్‌కు సెగ: ఐదుగురు ఎమ్మెల్యేల అసంతృప్తి.. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలోనే..

|
Google Oneindia TeluguNews

బీహర్‌లో నితీశ్ కుమార్.. పార్టీలను మంచినీరు తాగినట్టు మార్చారు. బీజేపీకి చేయిచ్చి.. ఆర్జేడీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. పైగా తమకు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వలేదు అని ఆరోపణలు చేశారు. ఓకే.. మళ్లీ ప్రభుత్వం కొలువుదీరింది. 31 మంది సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకేముంది మిగిలిన వారిలో అసంతృప్తి వస్తోంది. అలా ఐదుగురు నిరసన తెలిపారు.

 unhappy JD(U) MLAs skip Bihar cabinet expansion ceremony

సొంత పార్టీలో అసంతృప్త ఎమ్మెల్యేలు నితీశ్‌కు వ్యతిరేక కూటమి కట్టనున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. బీహార్‭ మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమానికి నితీశ్ ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. నితీశ్, తేజస్వీ కలయికలో మంగళవారం బీహార్‭లో కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ఆర్జేడీ నుంచి 16, జేడీయూ నుంచి 11 మంది, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ పార్టీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు మంత్రులుగా అవకాశం దక్కింది.

డాక్టర్ సంజీవ్ కుమార్, పంకజ్ కుమార్ మిశ్రా, సుదర్శన్ కుమార్, రాజ్కుమార్ సింగ్, షాలిని మిశ్రా మాత్రం ప్రమాణ స్వీకారానికి రాలేదు. వీరంతా మంత్రివర్గంలో చోటు దక్కలేదనే అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఆర్జేడీతో చేతులు కలపడం కూడా వీరికి నచ్చలేదని సమాచారం. జేడీయూలో అసమ్మతి పెరిగితే వారంతా బీజేపీ వైపే వెళ్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తం 31 మంది ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణం చేశారు. అందులో ఐదుగురు పదవీ ఆశించారు. కానీ నో యూజ్.. పిలుపు రాకపోవడంతో ఆగ్రహాం వ్యక్తం చేశారు.

English summary
Five JD(U) MLAs have expressed resentment over the Cabinet expansion in Bihar. A total of 31 ministers were inducted into the newly formed Bihar cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X