త్వరలో ఏకరీతి స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు: ఇవి ఎలా ఉంటాయంటే?
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ దేశమంతా ఒకేలా ఉండనుంది. డ్రైవింగ్ లైసెన్స్ డిజైన్, రంగు అంతా ఒకేలా కనిపించనుంది. 1 జూలై 2019 తర్వాత జారీ చేయబడే కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు, వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు (ఆర్సీ) ఏకరీతిలో ఉండనున్నాయి. రంగు, డిజైన్‌లతో పాటు ఒకే విధమైన సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి.
ఈ డ్రైవింగ్ లైసెన్స్‌లో మైక్రో చిప్స్, దానికి తోడు క్యూఆర్ కోడ్ ఉండనున్నాయి. ఈ కార్డ్స్ సమీప కమ్యూనికేషన్స్‌తో (ఎన్‌ఎఫ్‌సీ) అనుసంధానించబడతాయి. ఈ స్మార్ట్ కార్డు పైన అభ్యర్థి యొక్క వివరాలు ఉంటాయి. దీంతో పాటు డ్రైవర్ ప్రతిభ గురించి, అలాగే వెంటనే ట్రాఫిక్ యాక్సెస్ చేసే విధంగా ఈ స్మార్ట్ డ్రైవింగ్, ఆర్సీ ఉంటుంది. అంతేకాదు, వికలాంగుల కోసం ఏదైనా వాహనం ప్రత్యేకంగా ఉంటే దానిని కూడా పొందుపరిచే విధంగా ఉంటుంది.
ఈ ఆర్సీ వాహనం నుంచి వెలువడే ఉద్గారాల వివరాలను కలిగి ఉంటుంది. ఈ కారణంగా పొల్యూషన్ కంట్రోల్ వివరాలను కూడా గుర్తించవచ్చు.

ఒకేరూపు కలిగిన ఈ కొత్త డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల కోసం ఇప్పటికే యూనియన్ రోడ్డు ట్రాన్సుపోర్ట్ మినిస్ట్రీ ప్రక్రియను ప్రారంభించింది. డ్రైవర్లు తమ డ్రైవింగ్ లైసెన్సులను రెన్యూవల్ చేయించుకునే సమయంలో ఈ కొత్త వాటిని ఇవ్వనున్నారు. అలాగే వాహనాలను రీ రిజిస్ట్రర్ చేయించుకున్నప్పుడు కొత్త ఆర్సీలను ఇస్తారు.
ఈ కొత్త కార్డుల ద్వారా ఎన్‌ఫోర్సుమెంట్ పర్సనల్, ఆర్టీవో అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనం డ్రైవర్ గురించి సులభంగా వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ కొత్త కార్డుల ద్వారా సంబంధిత వాహనం లేదా డ్రైవర్ గురించి, వాహనం లేదా డ్రైవర్ గురించిన గత విషయాలను గుర్తించవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు సెంటర్ డేటాబేస్ ఆఫ్ వాహన్ (వెహికిల్స్) అండ్ సారథి (డ్రైవర్)లో ఉంటాయి. ఈ వివరాలతో కూడిన యూఆర్ఎల్‌కు నేరుగా యాక్సెస్ ఉంటుంది.
-
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications