వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూపర్ వే: అప్పటికి మించి మోడీకే సాధ్యమంది, కానీ ఆ మార్క్ చేరలేదు!

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో నలభై ఏళ్ల తర్వాత ఓ పార్టీకి 300కు పైగా సీట్లు వచ్చాయి. యూపీలో బీజేపీకి అతిపెద్ద గెలుపు ఇదే. గతంలో కళ్యాణ్ సింగ్ ఉన్నప్పుడు 221 స్థానాలు వచ్చాయి.

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో నలభై ఏళ్ల తర్వాత ఓ పార్టీకి 300కు పైగా సీట్లు వచ్చాయి. యూపీలో బీజేపీకి అతిపెద్ద గెలుపు ఇదే. గతంలో కళ్యాణ్ సింగ్ ఉన్నప్పుడు 221 స్థానాలు వచ్చాయి.

ఇప్పుడు ఏకంగా మూడు వందల పై చిలుకు సీట్లు గెలుచుకుంది. అయితే, 300కు పైగా సీట్లు దాదాపు నలభై ఏళ్ల క్రితం వచ్చాయి. మళ్లీ ఇప్పుడు వచ్చాయి. నాడు కాంగ్రెస్‌ పార్టీ అత్యధికంగా 325 స్థానాలను కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

గెలుపు

గెలుపు

శనివారం వెలువడిన ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే యూపీలో నాటి పరిస్థితి ఉంది. మొత్తం 403 స్థానాలకు గాను బీజేపీ ఇప్పుడు 325 స్థానాలను గెలుచుకుంది.

నేడు ఎస్పీ కాంగ్రెస్ కలిసి..

నేడు ఎస్పీ కాంగ్రెస్ కలిసి..

ఎస్పీ కాంగ్రెస్‌ కూటమి 54 స్థానాల్లో గెలుపొందింది. 1980లో జూన్‌ 9న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 1985 మార్చి 10వరకు అధికారంలో కొనసాగింది. అంతకుముందు 1977లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ ఏకంగా 352 స్థానాలు దక్కించుకుంది. అప్పుడు కాంగ్రెస్‌ కేవలం 47 స్థానాలకే పరిమితమైంది.

మోడీ హవా

మోడీ హవా

యూపీలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 1951లో కాంగ్రెస్‌ 388 స్థానాలు సొంతం చేసుకుంది. 2017 వరకు ఏ పార్టీ ఆ మార్కును అందుకోలేదు. 2014 లోకసభ ఎన్నికల్లో 80 స్థానాలకు గాను 73 స్థానాలు బీజేపీ గెలవడం ద్వారా మోడీ సత్తా చాటింది. ఇప్పుడు నలభయ్యేళ్ల తర్వాత 300 మార్క్ దాటడం ద్వారా మరోసారి మోడీ హవా తెలిపింది. కానీ 1951 నాటి మార్క్ మాత్రం సొంతం కాలేదు.

సూపర్ వేవ్

సూపర్ వేవ్

2016 నవంబరు 8న కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసింది. నోట్ల రద్దు తర్వాత వచ్చిన ఎన్నికల్లో బీజేపీ నిర్ణయాన్ని ప్రజలు ఏ మేరకు ఆమోదిస్తారో అని సర్వత్రా ఉత్కంఠ కనిపించింది. తాజా ఫలితాలను విశ్లేషిస్తే నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజలు ఆమోదముద్ర వేసినట్లు కన్పిస్తోంది. మోడీ గెలుపుపై ఓమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ఈ సూపర్ వేవ్‌ను ఏ సర్వే కూడా చెప్పలేదని ప్రశంసించారు.

English summary
As the results of various exit polls showed the saffron party doing well in Uttar Pradesh, Uttarakhand, Goa and Manipur, the BJP on Saturday said the ‘Modi magic’ will once again bring the four state governments back to the party once again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X