యూపీ జర్నలిస్ట్ రాసిన వార్తల ప్రతిఫలం.. శానిటైజర్ పోసి సజీవదహనం .. కేసులో షాకింగ్ విషయాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ జర్నలిస్ట్ ఉన్న ఇంటికి నిప్పంటించిన ఘటనలో జర్నలిస్టుతో పాటు అతని స్నేహితుడు సజీవదహనమయ్యారు. బలరాంపూర్ పట్టణంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో స్థానిక జర్నలిస్టు రాకేష్ సింగ్ నిర్భీక్ , తన స్నేహితుడు పింటూ సాహు కలిసి ఉంటున్నాడు. దుండగులు వారు ఉన్న ఇంటికి నిప్పంటించగా ఈ ఘటనలో జర్నలిస్టు రాకేష్ సింగ్ తో పాటు అతని స్నేహితుడు సజీవదహనమయ్యారు. ఇక ఈ కేసును చేదించిన పోలీసులు వివరాలు వెల్లడించారు.

రాకేశ్ సింగ్ నిర్భీక్, అతని స్నేహితుడి సజీవదహనం .. ఆస్పత్రిలో మరణించిన జర్నలిస్ట్
స్థానిక జర్నలిస్ట్ రాకేశ్ సింగ్ నిర్భీక్ మరియు అతని స్నేహితుడిని సజీవదహనం చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సంఘటన జరిగిన సమయంలో జర్నలిస్ట్ భార్య, పిల్లలు బంధువుల ఇంట్లో లేరని, వారు బంధువుల ఇంటికి వెళ్లినట్టు తెలుస్తుంది . ఉత్తర ప్రదేశ్‌లో 37 ఏళ్ల జర్నలిస్టు, రాకేశ్ సింగ్ నిర్భీక్ లక్నోకు చెందిన వార్తాపత్రిక రాష్ట్రీయ స్వరూప్ కోసం పని చేస్తున్నారు. ఆయన స్నేహితుడు పింటు సాహు (34) తో కలిసి లక్నో నుండి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న బలరాం పూర్ లో ఉంటున్నారు . వారు ఉన్న ఇంటికి నిప్పంటించగా సాహు అక్కడికక్కడే మృతి చెందగా , జర్నలిస్ట్ నిర్భీక్ ఆస్పత్రిలో మరణించారు .

గ్రామ ప్రాధాన్ అవినీతిపై వార్తలు రాసిన ప్రతిఫలం .. మరణ వాంగ్మూలంలో జర్నలిస్ట్
అతను చనిపోయే ముందు, స్థానిక గ్రామ గ్రామ ప్రధాన్ మరియు ఆయన కుమారుడు చేసిన అవినీతిపై తాను క్రమం తప్పకుండా వార్తలు రాస్తున్న క్రమంలో ఈ దాడి జరిగినట్టు పేర్కొన్నారు . జర్నలిస్ట్ మరణ వాంగ్మూలం లో చెప్పిన విషయాల మేరకు సోమవారం, బాల్రాంపూర్ పోలీసులు ఈ నేరానికి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. వారిలో ఒకరు, రింకు మిశ్రా, ప్రధాన్ కుమారుడు. ఇతర నిందితులు హత్యతో సహా క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న అక్రమ్ మరియు అతని స్నేహితుడు లలిత్ మిశ్రాలుగా పేర్కొన్నారు .

జర్నలిస్టు స్నేహితుడికి ఉన్న ఆర్ధిక లావాదేవీల వివాదం కూడా కారణం
బాధితులకు నిప్పు పెట్టడానికి ముందు వారు హ్యాండ్ శానిటైజర్‌ను బాధితులపై పోశారని పోలీసులు తెలిపారు. నిందితులు ఈ నేరాన్ని ప్రమాదవశాత్తు అనిపించేలా కప్పిపుచ్చడానికి శతవిధాలా ప్రయత్నించారని , అయితే ఇది కుట్ర అని మేము అర్థం చేసుకున్నాము" అని బలరాం పూర్ పోలీసు చీఫ్ దేవ్ రంజన్ వర్మ విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ హత్యలకు రెండు కారణాలున్నాయని పోలీసులు చెప్పారు. జర్నలిస్ట్ నిర్భీక్ జర్నలిజం ఒక కారణం కాగా మరొకటి మరొకటి రింకు మిశ్రాతో పింటూ సాహుకు ఉన్న ఆర్ధిక లావాదేవీల వివాదం.

హ్యాండ్ శానిటైజర్ పోసి సజీవ దహనం చేసిన నిందితులు
ఈ క్రమంలోనే లలిత్ (మిశ్రా) మరియు పింటు (సాహు) మద్యం షాపు వెలుపల వాదనకు దిగారని వారి మధ్య గొడవ జరిగింది అని బల్రాంపూర్ పోలీసు చీఫ్ చెప్పారు. దాడి చేసిన వారు నిప్పు పెట్టడానికి ముందు బాధితులు మద్యం తాగి ఉన్నారని, నిందితులు వారిపై హ్యాండ్ శానిటైజర్ పోసి నిప్పంటించారని చెప్పారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న మరికొంత మందిని అరెస్ట్ చెయ్యనున్నట్టు చెప్పారు .