అఫైర్: మూత్రం తాగించారు, ఆత్మహత్యాయత్నం

లక్నో: ఓ వ్యక్తికి బలవంతంగా మూత్ర తాగించారు. దాంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో అతనితో ఆ పని చేయించారు.

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో షహరాన్‌పూర్‌లోని ఇందిరా కాలనీలో చోటు చేసుకుంది. ఓ అమ్మాయితో అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడని గ్రామ పంచాయతీ ఆరోపిస్తూ అతనితో మూత్రం తాగించింది.

చికిత్స కోసం ఆ వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, తాను ఏ విధమైన అక్రమ సంబంధం పెట్టుకోలేదని అతను అంటున్నాడు. తనను కొట్టారని, బలవంతంగా మూత్రం తాగించారని, తనకు ఆ అమ్మాయి ఎవరో కూడా తెలియదని, ఆ అమ్మాయితో తనకు అక్రమ సంబంధం ఉన్నట్లు ఆరోపిస్తున్నారని అతను తన గోడు వెళ్లబోసుకున్నాడు

UP: Man attempts suicide after forced to drink urine

బతుకంటే భయం వేస్తోందని అన్నాడు. సాధ్యమైనంత త్వరగా పోలీసులు చర్యలు తీసుకవాలని అన్నాడు. సంఘటనపై దర్యాప్తు చేపట్టాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించినట్లు షహరాన్‌పూర్ పోలీసు సూపరింటిండెంట్ బబ్లూ కుమార్ చెప్పారు.

అతన్ని కొట్టారని తమకు సమాచారం ఉందని, అతను ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్నాడని, అతని వాంగ్మూలం తీసుకున్నామని, చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+