US-Iran War: ఇరాన్ పై అమెరికా ఆంక్షల్లో చిక్కుకున్న 4 భారతీయ కంపెనీలివే..!
అమెరికా-ఇరాన్ యుద్దం (US-Iran War) రోజుకో మలుపు తిరుగుతోంది. ఇరాన్ పై ఆరు నెలలుగా యుద్దం చేస్తున్నా లొంగకపోవడంతో ఆర్ధికంగా దిగ్బంధించడమే ఇందుకు సరైన మార్గం ఆన్న నిర్ణయానికి అమెరికా వచ్చేసింది. దీంతో ఆర్దికంగా ఇరాన్ పై ఆంక్షలు (US Sanctions) విధిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్ తో వాణిజ్యం చేస్తున్న దేశాలపైనా ఈ ప్రభావం పడుతోంది. ఇందులో భారత్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ కంపెనీలపై సైతం అమెరికా ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి.
ఇరాన్ నుంచి పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నారనే ఆరోపణలతో 4 భారతీయ కంపెనీలపై అమెరికా తీవ్ర ఆంక్షలు విధించింది. ఇరాన్ ఆర్థిక వనరులను దెబ్బతీసే లక్ష్యంతో అమెరికా తాజాగా చేపట్టిన ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్ లో భాగంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆంక్షల పరిధిలోకి వచ్చిన భారతీయ సంస్థల్లో సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్, పీపీ సాఫ్ట్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకృతీస్ ఇన్‌ఫ్రా ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే కస్టమ్స్ బ్రోకర్ సంస్థ పోర్టీజ్ పార్ట్‌నర్స్ ఎల్‌ఎల్‌పీ ఉన్నాయి.

వీటితో పాటు భారతీయ పౌరులైన ఇద్రిస్మియా అష్రఫ్మియా షేక్, హరీష్ రామచంద్ర రంగీ, ప్రశాంత్ గార్గ్‌లపై కూడా అమెరికా చర్యలు తీసుకుంది. సదాశివ ఓవర్సీస్ సుమారు 69 మిలియన్ డాలర్లు, మిగిలిన రెండు సంస్థలు చెరో 25 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు అమెరికా వెల్లడించింది.ఇరాన్ ఆదాయ మార్గాలన్నింటినీ పూర్తిగా మూసివేయడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ నిన్న వెల్లడించారు. ఇరాన్‌తో ఆర్థిక సంబంధాలు కొనసాగించే ఏ దేశమైనా, సంస్థయినా అమెరికా ఆగ్రహానికి గురికాక తప్పదని, ద్వితీయ శ్రేణి ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుందని బెస్సెంట్ హెచ్చరించారు.














Click it and Unblock the Notifications