రష్యాలో ల్యాండ్ అయిన అమెరికా యుద్ధ విమానం.. ఏం జరుగుతోంది..?

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో అస్థిరత నెలకొంది. పశ్చిమాసియాలో అమెరికా- ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి ఆంక్షల వలయంలో చిక్కుకుంది. దాంతో అనేక దేశాల్లో ఇంధన, ఆహార ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం నాలుగేళ్లుగా సాగుతూనే ఉంది. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో అమెరికా వైమానిక దళానికి చెందిన మిలిటరీ విమానం రష్యాలో ల్యాండ్ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ఉక్రెయిన్- రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా యుద్ధ విమానం రష్యాలో ల్యాండ్ కావడంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అమెరికా ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీ-17 గ్లోబ్ మాస్టర్ 111 మిలిటరీ ట్రాన్స్ పోర్ట్ విమానం ఆగస్టు 25 మంగళవారం ఉదయం మాస్కోలోని నుకోవో ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది. దాంతో వాషింగ్టన్.. మాస్కోతో కొత్తగా ఏదైనా దౌత్య పరమైన చర్చలు ప్రారంభించాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా అందించిన సమాచారం ప్రకారం రిగా ఎయిర్ పోర్ట్ నుంచి రష్యా లోని నుకోవో ఎయిర్ పోర్ట్ వరకు అమెరికా మిలిటరీ ప్లేన్ ప్రయాణించింది. RCH4555 అనే నెంబర్ కలిగిన యూఎస్ యుద్ధ విమానం రిగా నుంచి ఇవాళ ఉదయం 8 గంటల 50 నిమిషాలకు డిపార్ట్ అయింది. ఆ తర్వాత ఉదయం 10 గంటల 4 నిమిషాలకు నుకోవో ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఇక ఈ సీ-17 విమానం ఆగస్టు 23 న మేరీల్యాండ్ లోని క్యాంప్ స్ప్రింగ్స్ ప్రాంతం నుంచి రిగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మిలిటరీ ప్లేన్ ను సాధారణంగా సీనియర్ అమెరికా అధికారులు, ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ తదితర విభాగాలు వినియోగిస్తుంటాయని తెలుస్తోంది.

US Air Force Boeing C-17 Globemaster III military transport aircraft landed Moscow Vnukovo Airport

అయితే అమెరికా యుద్ధ విమానం మాస్కోలో ఎందుకు ల్యాండ్ అయిందో తెలియాల్సి ఉంది. ఈ విషయంపై స్పందించిన క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్.. అమెరికా యుద్ధ విమానం మాస్కోలో ల్యాండింగ్ పై తమకు సమాచారం అందలేదని తెలిపారు. అలాగే రష్యన్ స్టేట్ మీడియా ఇదే అంశంపై మాట్లాడుతూ.. ఈ వారంలో అమెరికా- రష్యా మధ్య ఎలాంటి సమావేశాలు లేవని స్పష్టం చేసింది. ఇక సీ-17 గ్లోబ్ మాస్టర్ 111 మిలిటరీ విమానాన్ని అధికంగా సైన్యాన్ని తరలించేందుకు ఉపయోగిస్తుంటారు. అలాగే యుద్ధ సామాగ్రి, దౌత్య పరమైన ఒప్పందాల నేపథ్యంలో ఇతర దేశాలకు ఆయుధ పరికరాలు సరఫరాలో వీటిని వినియోగిస్తుంటారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+