జయలలితకు కుమార్తె ఉందా, ఆశ్చర్యంగా ఉందే. ఆస్తికోసం డ్రామాలు, నటి లత !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కుమార్తె ఉన్నట్లు తాను చెప్పడాన్ని ప్రముఖ సీనియర్‌ నటి లత ఖండించారు. మదురై జిల్లా ఎంజీఆర్‌ అభిమాన సంఘం నిర్వహించిన ఎంజీఆర్‌ శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు లత మంగళవారం మదురై చేరుకున్నారు. అమ్మ ఆస్తి కోసం కుమార్తె అమృత ఉన్నట్లు కొందరు డ్రామాలు ఆడిస్తున్నారని లత అనుమానం వ్యక్తం చేశారు.

 జయ కుమార్తె, నేను చెప్పలేదు

జయ కుమార్తె, నేను చెప్పలేదు

మదురైలో మంగళవారం అలనాటి నటి, జయలలిత స్నహితురాలు లత మీడియాతో మాట్లాడుతూ జయకు కుమార్తె ఉన్నట్లు తాను ఎక్కడా, ఎప్పడూ చెప్పలేదని వివరణ ఇచ్చారు. జయలలితకు బెంగళూరులో అమృత అనే కుమార్తె ఉందని మీడియాలో చూసి ఆశ్చర్యానికి గురైనానని నటి లత మీడియాకు చెప్పారు.

అమ్మ అభిమానులు జీర్ణించుకోలేరు

అమ్మ అభిమానులు జీర్ణించుకోలేరు

తమిళనాడు ప్రజలు ఎంతో ప్రేమతో అమ్మా అని పిలిపించుకునే జయలలితకు కుమార్తె ఉన్నట్లు వస్తున్న వార్తలను తాను ఖండిస్తున్నానని, ఈ విషయాన్ని తనతో పాటు జయలలిత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని నటి లత అన్నారు.

 అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు

అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు

జయలలిత వ్యక్తిత్వం గురించి తమిళనాడు ప్రజలతో పాటు దేశం మొత్తం తెలుసని నటి లత గుర్తు చేశారు. జయలలితకు ఏ విషయం అయినా ధైర్యంగా బయటకు చెప్పే అలవాటు ఉందని, ఆమె ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వెయ్యలేదని లత ప్రశ్నించారు.

ఆస్తి కోసం కుట్రలు

ఆస్తి కోసం కుట్రలు

జయలలిత ధైర్యవంతురాలని, ఆమెకు కుమార్తె ఉన్న విషయం నిజమైతే ఎప్పుడో ధైర్యంగా అందరి ముందు అంగీకరించే వారని నటి లత వివరించారు. జయలలిత ఆస్తుల కోసం కుట్రపన్నిన కొందరు వెనుక నుంచి బెంగళూరు అమృతను నడిపిస్తున్నారనే అనుమానం వ్యక్తం అవుతోందని లత అభిప్రాయం వ్యక్తం చేశారు.

శశికళ ఫ్యామిలీ నుంచి !

శశికళ ఫ్యామిలీ నుంచి !

అన్నాడీఎంకే పార్టీలో ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయని, వ్యక్తిగత కుటుంబ ఆధిపత్య వివాదాలు (శశికళ ఫ్యామిలీ రాజకీయాలు) దాటి నాయకులు బయటికి వచ్చారని, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం పాలన ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందనే నమ్మకం తనకుందని నటి లత అన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Veteran actress Latha has slammed Bangalore based Amrutha for saying she is Jayalalitha's daughter.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి