నేనూ చనిపోయాను: కుమార్తె మృతిపై విజయ్ ఆంటోనీ భావోద్వేగం
చెన్నై: తన కుమార్తెతోపాటు తాను కూడా చనిపోయానని సినీ నటుడు విజయ్ ఆంటోనీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె(16) ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చెన్నైలోని తమ నివాసంలో ఉరేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడింది. ఈ క్రమంలో విజయ్ ఆంటోనీ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్టు చేశారు.
తన కుమార్తెతోపాటు తానూ చనిపోయానని భావోద్వేగానికి గురయ్యారు. ఇక నుంచి తాను చేయబోయే ప్రతి మంచి పని ఆమె పేరున చేస్తానని.. దీంతో ఆమెతో కలిసి ఉన్నట్లు ఉంటుందని విజయ్ ఆంటోనీ వ్యాఖ్యానించారు. తన కుమార్తెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆవేదనకు గురయ్యారు.

'నా పెద్ద కుమార్తె ఎంతో దయగలది. అంతకుమించి ధైర్యవంతురాలు. కులం, మతం, బాధ, అసూయ, పేదరికం, ద్వేషపూరిత వాతావరణం లేని ప్రశాంతమైన ప్రదేశంలోకి వెళ్లిపోయింది. ఆమె ఇప్పటికీ నాతో మాట్లాడుతోంది. తనతోపాటే నేనూ చనిపోయాను. ఇక నుంచి నేను చేసే సేవా కార్యక్రమాలను ఆమె పేరుతోనే ప్రారంభిస్తాను' అని విజయ్ ఆంటోనీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
విజయ్ చేసిన ట్వీట్ చూసిన ఆయన అభిమానులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఆ దేవుడు మీకు మనోబలాన్ని ఇవ్వాలి.. ఆమె ఆత్మకు శాంతి కలగాలి అని నెటిజన్లు ఆకాంక్షించారు. మంచి మనుషులకు అంతా మంచే జరుగుతుందని మరొకరు వ్యాఖ్యానించారు.
సెప్టెంబర్ 19వ తేదీన తెల్లవారుజామున 3 గంటల సమయంలో విజయ్ ఆంటోనీ పెద్ద కుమార్తె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయాన్నే ఇంట్లో వాళ్లు చూసి.. వెంనటే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రమైన ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. చెన్నైలోని ఓ ప్రైవేటు విద్యాలయంలో ఆమె ఇంటర్ చదువుతోంది. విజయ్-నిర్మాత ఫాతిమా దంపతులకు ఆమె మొదటి కుమార్తె. వీరికి ఇద్దరు కుమార్తెలు. 2006లో ఫాతిమాను విజయ్ వివాహం చేసుకున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications