వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral video: 66ఏళ్ళ నాటి ఫ్రిజ్ ఇంత బాగుందా.. ఫీచర్స్ చూస్తే గ్యారెంటీగా ఆశ్చర్యపోతారు!!

|
Google Oneindia TeluguNews

శాస్త్ర, సాంకేతిక రంగాలలో గణనీయమైన అభివృద్ధిని సాధించామని గొప్ప అని చెప్పుకుంటున్నాం. అయితే మనకంటే గతంలోనే అద్భుతమైన టెక్నాలజీ ఉందని అనేక విషయాలు ఇప్పటి వరకు బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా 2022 లో ఉన్న రిఫ్రిజిరేటర్ మోడల్స్ కంటే, రిఫ్రిజిరేటర్ లో ఉన్న ఫీచర్స్ కంటే అద్భుతమైన ఫీచర్స్ 1956లోనే రిఫ్రిజిరేటర్ లో ఉన్నాయన్నది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోషల్ మీడియాలో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న 1950 దశకం నాటి ఓ రిఫ్రిజిరేటర్ వీడియో

జీవితాన్ని సులభతరం చేయడానికి సాంకేతికత తప్పనిసరిగా మారిన నేటి తరుణంలో ఇప్పుడే గొప్ప సాంకేతికత ఉందని చాలా మంది ఫీల్ అవుతారు. కానీ ఒకప్పటి టెక్నాలజీ మనల్ని ఆశ్చర్యానికి గురి చెయ్యక మానదు. సంవత్సరాలుగా, అనేక వస్తువులు ప్రజల జీవన విధానాన్ని మరింత మెరుగు పరచడం కోసం ఎప్పటికప్పుడు మార్పులకు లోనవుతూ వచ్చాయి. కానీ గతం కంటే ఇప్పుడు అన్ని విషయాల్లో ప్రగతి సాధించామని చెప్పుకుంటుంటే, గతంలోనూ అద్భుతమైన టెక్నాలజీ ఉందని 1950 దశకం నాటి ఓ రిఫ్రిజిరేటర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బ్లాక్ అండ్ వైట్ వీడియోలో రిఫ్రిజిరేటర్ ఫీచర్స్ చెప్తున్న మహిళ

బ్లాక్ అండ్ వైట్ వీడియోలో రిఫ్రిజిరేటర్ ఫీచర్స్ చెప్తున్న మహిళ

ఈ రోజు అందుబాటులో ఉన్న రిఫ్రిజిరేటర్‌లలో కనిపించే వాటి కంటే దాని ఫీచర్‌లను ఇంటర్నెట్ లో నెటిజన్లు తెగ ఇష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రిఫ్రిజిరేటర్ కు సంబంధించి బ్లాక్ అండ్ వైట్ వీడియోలో ఒక మహిళ రిఫ్రిజిరేటర్‌లోని వివిధ ఫీచర్‌లను వీక్షకులను తెలియజేస్తుంది . ఇక ఆ ఫీచర్ లు చూసినవారిని అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి., అప్పట్లోనే ఇంత అద్భుతమైన ఫీచర్స్, ఫెసిలిటీస్ ఉన్నాయా అని చర్చిస్తున్నారు.

రిఫ్రిజిరేటర్ లో ఉన్న ఫీచర్స్ , ఫెసిలిటీస్ ఇవే

రిఫ్రిజిరేటర్ లో ఉన్న ఫీచర్స్ , ఫెసిలిటీస్ ఇవే

వీడియోలో, ఫ్రిజ్‌లో సీసాలు , క్యాన్డ్ గూడ్స్‌కు ప్రత్యేక స్థానం కేటాయించబడింది. వెన్నతో పాటు చీజ్‌, బటర్ లకు స్థలం ఉన్నట్లు చూపబడింది. దీని క్రింద బాటిల్స్ పెట్టే సైడ్ డోర్ లోనే కూరగాయలను నిల్వ చేయడానికి ఒక గ్లాస్ బాక్స్ అమర్చబడి ఉంది. సులభంగా హ్యాండ్లింగ్ కోసం కూరగాయల బాక్స్ ఫ్రిజ్ నుండి కూడా కంప్లీట్ గా కూడా బయటకు తీసుకోవచ్చు. . ఫ్రిజ్‌లోని అన్ని అల్మారాలు బయటికి తీసేలా ఉన్నాయి. కాబట్టి వెనుక ఉన్న వస్తువులను తీయడం కోసం, వస్తువులన్నింటినీ పక్కకు జరపాల్సిన అవసరం లేదు. ఫ్రీజర్‌లో అనేక ఐస్ ట్రేలకు కూడా స్థలం ఉంది. ఇక ఈ సౌకర్యం ఐస్ క్యూబ్‌లను సులభంగా బయటకు తీసుకునేలా ఉంది. ఇప్పటి ఫ్రిజ్ లలో ఐస్ క్యూబ్స్ కు పైన స్థలం ఇస్తే, పాతకాలం నాటి ఫ్రిజ్ లో క్రింద డీప్ కు స్థలం ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పటి ఫ్రిజ్ ల కంటే చాలా స్థలం ఉన్నట్టు వీడియోలో కనిపించింది. ఇక రిఫ్రిజిరేటర్ మోడల్ కూడా చాలా అందంగా ఉంది.

పాతకాలం నాటి రిఫ్రిజిరేటర్ లను కొనియాడుతున్న నెటిజన్లు

ఈ 66 ఏళ్ల ఫ్రిజ్ ఇప్పుడు మనకు లభించిన దానికంటే మెరుగ్గా ఉందని అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతుంది. వీడియోకు వినియోగదారులు ప్రతిస్పందిస్తున్నారు. గతంలోనే రిఫ్రిజిరేటర్లు దృఢంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు వస్తున్న రిఫ్రిజిరేటర్ లో అంత క్వాలిటీ ఉండటం లేదని చెబుతున్నారు. ఆ కాలంలోనే అన్ని ఫీచర్స్ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు. చాలా స్ట్రాంగ్ గా ఉండేవని, త్వరగా పాడయ్యేవి కాదని అంటున్నారు. నాటి ఫ్రిజ్ ను చూసి గ్రేట్ అంటూ తెగ కొనియాడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫ్రిజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

English summary
Check out the features of a 66-year-old refrigerator. It looks much better than the current refrigerators. This video has gone viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X