వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral video: అక్కడ పులికి మాత్రమే గ్రీన్ సిగ్నల్; దర్జాగా రోడ్డు దాటి ఆపై..

|
Google Oneindia TeluguNews

మనుషులు ప్రయాణం చేసే రోడ్డుపై, అందరూ చూస్తుండగా, జనాలను చూస్తూ ఓ పులి దర్జాగా రోడ్డు దాటింది. అధికారులు ట్రాఫిక్ నిలిపివేస్తే, ఎవరిపై ఎటువంటి దాడి చేయకుండా, పులి రోడ్డు దాటిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ప్రస్తుతం దర్జాగా రోడ్డు దాటుతున్న పులి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పులి రోడ్డు దాటటం కోసం గ్రీన్ కారిడార్ .. వీడియో వైరల్


అటవీ విస్తీర్ణం తగ్గిపోవడంతో, అటవీ జంతువులు తరచుగా మనుషుల నివాస ప్రాంతాలలో, ప్రయాణం చేసే దారుల పైకి రావడంతో మానవుల జంతువుల మధ్య సంఘర్షణ రోజురోజుకు పెరుగుతోంది. వన్యప్రాణుల వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్న తరుణంలో.. పులి హైవే దాటేందుకు గ్రీన్ కారిడార్‌ను రూపొందించిన సిబ్బంది చేసిన పని, ఆపై పులి దర్జాగా నడిచివెళ్ళిన వీడియో ఆన్‌లైన్‌లో ప్రశంసలు అందుకుంటుంది.

మహారాష్ట్రలో రోడ్డుపై దర్జాగా పులి ..

మహారాష్ట్రలో రోడ్డుపై దర్జాగా పులి ..


మహారాష్ట్రలోని చంద్రపురి లోని నాగ్ భీడ్ బ్రహ్మపురి హైవేపై 2 రోజుల క్రితం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. భారీ ట్రాఫిక్ ఉన్నకారణంగా ఓ పులి అక్కడే రోడ్డు కట్టకుండా పక్కన కూర్చుంది. ఇక పులిని చూసిన కొందరు అటవీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది. పోలీసుల సహాయంతో ట్రాఫిక్ ను కొద్దిసేపు నిలిపివేశారు. అధికారులు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రయాణికులను ఆపి ప్రజలను ప్రశాంతంగా ఉండమని కోరారు. ఎలాంటి గొడవా చేయకుండా ఉండాలని సూచించారు. అయితే ఎందుకో అర్ధం కాక చాలా మండి వాహనదారులు బైక్ లపైన కూడా అలాగే ఉండిపోయారు.

వాహనాలు ఆపి జనాలు చూస్తుండగా దర్జాగా రోడ్డు దాటి అడవిలోకి వెళ్ళిపోయిన పులి


ఆపై కొంచెం దూరంలో చెట్ల వెనకాల నుంచి మెల్లగా అడవిలోంచి రోడ్డు దాటేందుకు పులి నడుచుకుంటూ వచ్చింది. దీంతో వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. మోటారు సైకిళ్లు మరియు కార్లపై ఉన్న వ్యక్తులు తమ మొబైల్ ఫోన్‌లలో అసాధారణ దృశ్యాన్ని బంధించడానికి ప్రయత్నం చేసిన క్రమంలోనూ, అధికారులలో ఒకరు నిశ్శబ్దంగా ఉండమని మరియు జంతువును ఏ విధంగానూ భయపెట్టవద్దని ప్రజలను కోరారు. అడవిలోకి తిరిగి వెళ్లే వరకు వాహనాలు ఓపికగా వేచి ఉండటంతో పులి ఆందోళన చెందకుండా రోడ్డు దాటడానికి సమయం తీసుకుంది. దర్జాగా అడవిలోకి వెళ్ళిపోయింది.

రోడ్డు దాటటానికి పులికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ .. సోషల్ మీడియాలో పోస్ట్ లు

రోడ్డు దాటటానికి పులికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ .. సోషల్ మీడియాలో పోస్ట్ లు


పులికి మాత్రమే గ్రీన్ సిగ్నల్. ప్రజలు కూడా దానికి సహకరించారు అని అని ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. అటవీ, పోలీసు అధికారులకు మరియు ప్రజలకు తన కృతజ్ఞతలు మరియు ప్రశంసలను తెలియజేశారు. మహారాష్ట్రలోని బ్రహ్మపురి మరియు నాగ్‌భీర్ మధ్య జాతీయ రహదారి 353Dలో ఈ వీడియో తీశారని పలువురు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

ప్రశాంతంగా హుందాగా రోడ్డు దాటిన పులి తీరుపై ఆశ్చర్యం

ప్రశాంతంగా హుందాగా రోడ్డు దాటిన పులి తీరుపై ఆశ్చర్యం

చాలా మంది ప్రజలు మరియు వాహనాలు ఉన్నప్పటికీ పులి ప్రశాంతంగా వెళ్లడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పులి మనుషులు ఎవరి పైనా దాడి చేయకుండా దర్జాగా అడవిలోకి వెళ్లడం అందరినీ అబ్బుర పరిచింది. అనేక జాతీయ ఉద్యానవనాలు మరియు రిజర్వ్‌లకు నిలయంగా ఉన్న మహారాష్ట్రలో తరచుగా హైవేలు మరియు నివాస ప్రాంతాలలో పులులు సంచరిస్తూ ఉంటాయి. పులుల సంచారం కొత్త కాకున్నా, రోడ్డు క్రాస్ చేసిన పులి అడవిలోకి వెళ్లిన విధానం మాత్రం ఆసక్తి కలిగించింది. సోషల్ మీడియాలో అది పులి అంటే... అంటూ ఆసక్తికర పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.

English summary
Officials have given green signal only to Tiger on Nag Bhid Brahmapuri Highway in Chandrapuri, Maharashtra. Due to this, the video of the tiger crossing the road and then going into the forest goes viral
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X