వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక ఫేక్ ఓటరు కార్డ్స్‌పై ఈసీ సీరియస్: రాజరాజేశ్వరినగర్ ఎన్నిక వాయిదా

By Srinivas
|
Google Oneindia TeluguNews

బెంగలూరు: దాదాపు పదివేల ఫేక్ ఓటరు కార్డులు బయటపడిన రాజరాజేశ్వరినగర్ నియోజకవర్గం ఎన్నికలను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఈ మేరకు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. ఈ నియోజకవర్గంలో ఎన్నికలను మే 28వ తేదీన నిర్వహించనుంది. మే 31న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

నగరంలోని ఓ ఫ్లాట్‌లో దాదాపు పదివేల నకిలీ ఓటరు కార్డులను ఈసీ గుర్తించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు శనివారం జరగాలి. కానీ పేక్ ఓటరు కార్డులు బయటపడటంతో ఈసీ సీరియస్‌గా తీసుకోని, ఎన్నికను వాయిదా వేసింది.

కర్నాటకలో మొత్తం 224 నియోజకవర్గాలు ఉన్నాయి. ఓ బీజేపీ అభ్యర్థి మృతి కారణంగా ఓ నియోజకవర్గంలో ఇప్పటికే వాయిదా పడింది. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వాయిదా పడింది.

ఆ తర్వాతే మారిన సీన్: నిజమేనా.. కర్నాటకపై లగడపాటి సర్వే, బీజేపీదే గెలుపు!ఆ తర్వాతే మారిన సీన్: నిజమేనా.. కర్నాటకపై లగడపాటి సర్వే, బీజేపీదే గెలుపు!

Voter ID scam: Voting In Bengalurus Rajarajeshwari Nagar deferred

రాజరాజేశ్వరి నగర్‌లో ఫేక్ ఓటరు కార్డుల అంశంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏ ఫ్లాట్‌లో అయితే ఫేక్ ఓటరు కార్డులు దొరికాయో ఆ ప్లాట్ ఓనర్ కాంగ్రెస్‌కు అనుకూలమని బీజేపీ అంటే, వారికే అనుకూలమని కాంగ్రెస్ చెబుతోంది.

కాగా, బీజేపీ వర్కర్ రాకేశ్ ఈ ఫేక్ ఓటరు రాకెట్ వెనుక బండారాన్ని బయట పెట్టారని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల అన్నారు. సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్న నాయుడు ఈ పేక్ రాకెట్ ఓటు వెనుక ఉన్నారని తేల్చారని చెప్పారు.

English summary
The election to the Rajarajeshwari Nagar Assembly constituency has been postponed following the voter ID scam. Polling will now be held on May 28 and counting on May 31.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X