షాకింగ్ వీడియో: కాశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవానుపై గుంపుగా దాడి
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్‌ను వెంటాడి మరీ దాడిచేసిన దృశ్యాల వీడియో ఒకటి నెట్‌లో వైరల్‌గా మారింది. కాశ్మీర్ అల్లర్లలో సాయుధుడైన సీఆర్ పీఎఫ్ జవాన్‌ను కొందరు చుట్టుముట్టారు. చివరికి తప్పించుకొని పోతున్న ఆ జవాన్ను వెంటాడి అమానుషంగా గుంపుగా వచ్చి దాడిచేశారు.
'ది ఇల్లీగల్ ఇండియన్' పేరుతో శనివారం పోస్ట్ అయిన ఈ వీడియో వైరల్ అయింది. జమ్మూకాశ్మీర్‌లో ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ చోటు చేసుకుందనే పూర్తి వివరాలు తెలియరాలేదు.

అయితే, ఈ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో షేర్ అవుతోంది.
కాగా, సంచలనంగా మారిన ఈ వీడియోపై అటు పోలీస్ వర్గాలనుంచి గానీ, ఇటు అధికారుల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు.












Click it and Unblock the Notifications