శివుడి గెటప్‌లో హల్చల్ చేసిన బీహార్ మాజీ మంత్రి
బీహార్: బీహార్ మాజీ మంత్రి ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ శివుడి వేశంలో హల్చల్ చేశారు. పాట్నాలోని ఓ శివాలయంలో పూజలు నిర్వహించేందుకు గాను ఆయన శివుడి వేశంలో వెళ్లారు.అక్కడ పూజలు నిర్వహించిన అనంతరం దియోఘఢ్‌లోని బాబా బైద్యనాథ్ ధామంకు వెళ్లారు. పూజలు నిర్వహిస్తున్న సమయంలో తేజ్ ప్రతాప్ యాదవ్ ఢమరుకం వాయించారు. శంఖాన్ని పూరించారు. ఆ తర్వాత గుడి పూజారి హారతి ఇవ్వగా అది స్వీకరించి అక్కడి నుంచి బయలు దేరారు.

అయితే తేజ్ ప్రతాప్‌కు శివుడు అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టమని తన సన్నిహితులు చెబుతారు. ఇలా శివుడి వేషం వేయడం తేజ్ ప్రతాప్‌కు ఇది మొదటి సారి కాదు. ఐశ్వర్యను వివాహం చేసుకోక కొన్ని రోజుల ముందు ఒక పోస్టర్‌పై శివుడి వేశంలో తేజ్ ప్రతాప్, పార్వతిగా భార్య ఐశ్వర్యలు దర్శనమిచ్చారు. మహువా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న తేజ్ ప్రతాప్... గతంలో కృష్ణుడి గెటప్‌లో అదరగొట్టాడు. 2017లో తను మంత్రిగా ఉన్న సమయంలోనే తేజ్ ప్రతాప్... శ్రీకృష్ణుడి వేషం వేసి అందరినీ ఆకట్టుకున్నారు.

ఒక శాలువ తన చుట్టూ కట్టుకుని, నీలిరంగు జాకెట్ ధరించి తలకు ఎర్రటి పాగాతో కృష్ణుడిలా దర్శనమిచ్చారు. అంతేకాదు తలపై ఓ నెమలి ఈకను కూడా ఉంచారు. వేణువు పట్టకుని ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ యువ ఎమ్మెల్యే సినిమా ఇండస్ట్రీపై ధ్యాస పెట్టాడు. మూవీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. రుద్ర ది అవతార్ అనే సినిమా పోస్టర్‌ను తేజ్ ప్రతాప్ తన ఇన్స్‌టాగ్రామ్ పై పోస్ట్ చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications